Noida Twin Towers :  ఉత్తరప్రదేశ్‌లోని  నోయిడాలోని 40 అంతస్తుల ట్విన్‌ టవర్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నెల 28న కూల్చివేయనున్నారు.   రెండు టవర్లను కూల్చివేసేందుకు 3700 కిలోల పేలుడు పదార్థాలు అవసరం అవుతాయని అంచనా.  ప్రతి రోజూ 325 కిలోల పేలుడు పదార్థాలను అమరుస్తున్నారు.  పేలుడు పదార్థాలతో టవర్లను కూల్చివేసేందుకు నోయిడా అథారిటీకి సుప్రీం కోర్టు ఇటీవల అనుమతి ఇచ్చింది. ‘కట్టుదిట్టబమైన భద్రత మధ్య నోయిడాలోని సూపర్‌ టెక్‌ ట్విన్‌ టవర్స్‌కు పాల్వాల్‌నుంచి పేలుడు పదార్థాలను తీసుకువస్తున్నారు.  


ట్విన్ టవర్స్ కూల్చివేతకు ఏర్పాట్లు


 కూల్చివేసేందుకు భవనంలో 9,400 రంధ్రాలను వేయగా.. వీటిని పేలుడు పదార్థాలతో నింపనున్నారు.  ఉత్తరప్రదేశ్‌ పరిధిలోని నోయిడా సెక్టార్‌ 93 ప్రాంతంలో సూపర్ టెక్‌ లిమిలెడ్‌కంపెనీ 2009లో భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఈ భవనాల విషయంలో రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రణాళికను చూపాలన్న నిబంధనను బిల్డర్‌ పట్టించుకోకపోవడం, అధికారులతో కుమ్మక్కై నిబంధనలు పాటించకపోవడంతో స్థానికంగా ఉన్న నలుగురు ఓ లీగల్‌ కమిటీగా ఏర్పడి సూపర్‌ టెక్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీం కోర్టు 40 అంతస్తుల జంట భవనాలను కూల్చివేయాలని గతేడాది ఆగస్టులో ఆదేశాలు ఇచ్చింది. 


చుట్టుపక్కల భవనాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు


ఇదే సమయంలో టవర్స్‌లో ప్లాట్లు కొన్న వారందరికీ 12శాతం వడ్డీతో డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ఈ పేలుడుకు మూడు గంటల ముందు, రెండు గంటల తర్వాత ఐదు గంటల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని నోయిడా అథారిటీ సీనియర్ అధికారి తెలిపారు. దీంతో ట్విన్ టవర్‌లకు ఆనుకుని ఉన్న ఎమరాల్డ్ కోర్ట్ ఏటీఎస్‌ విలేజ్ సొసైటీ నివాసితులపై కూడా ఈ కూల్చివేత తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. అంతటి భారీ నిర్మాణాల కూల్చివేతకు కేవలం 9 సెకన్ల సమయం మాత్రమే పడుతుందని సంస్థ అధికారులు తెలిపారు.  ట్విన్ టవర్స్‌కు దగ్గర్లో వందల సంఖ్యలో కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ పేలుళ్ల కారణంగా ఇతర భవనాలకు ఎలాంటి హాని జరగదని నిపుణులు హామీ ఇచ్చారని, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే.. బీమా సౌకర్యం అందుబాటులో ఉందని నొయిడా అథారిటీ అధికారులు తెలిపారు. 


28వ తేదీన 9 సెకన్లలో భవనం నేల మట్టం 


ఇప్పటి వరకూ విదేశాల్లో ఉపయోగం లేని భవాలను ఇలా పెద్ద ఎత్తున కూలగొడుతూ ఉంటారు. భవనంలో అన్ని స్థాయిల్లో పేలుడు పదార్థాలు అమర్చడం వల్ల తొమ్మిది సెకన్లలోనే కూలిపోతుంది. అలా పేకమేడలా కూలిపోతుంది. పక్కన ఒరగిపోవడం అంటూ ఉండదు. ఈ కూల్చివేత ప్రక్రియ లైవ్‌లో చూడవచ్చు.   *దేశంలో ఇప్పటి వరకూ పలు చోట్ల భవనాలను కూల్చివేసి ఉంటారు కానీ.. ఈ స్థాయిలో మొదటి సారిగా కూల్చబోతున్నారు.  హాలీవుడ్ సినిమాల్లో కనిపించే దృశ్యాలు.. ఇరవై ఎనిమిదో తేదీన నోయిడాలో కనిపించే అవకాశం ఉంది. 


ఏపీ - తమిళనాడు మధ్య జల జగడం ! రెండు ప్రాజెక్టుల్ని నిలిపివేయాలని జగన్‌కు స్టాలిన్ లేఖ !