Earthquake in Delhi: ఆప్ఘనిస్థాన్ లో 6.1 తీవ్రతతో గురువారం భూకంపం సంభవించినట్లు. దీని ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ (Delhi) సహా ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. మధ్యాహ్నం రాజధాని నగరంతో పాటు సమీప ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు మొదలయ్యాయి. ఢిల్లీలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఆప్ఘనిస్థాన్ లోని కాబూల్ కు 241 కి.మీ దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొంది. అటు, జమ్మూ కశ్మీర్ లోని పూంఛ్ జిల్లా, దక్షిణ పీర్ పంజాల్ ప్రాంతం, పాకిస్థాన్ లోని లాహోర్ లోనూ దీని తీవ్రత కనిపించింది. పంజాబ్, ఛండీగఢ్ లోనూ భూమి కంపించింది. పూంఛ్ లో కొండ చరియలు విరిగి పడినట్లు తెలుస్తోంది. బుధవారం సైతం ఆప్ఘనిస్థాన్ లో 4.1 తీవ్రతతో భూమి కంపించింది. భూకంపం ప్రభావంతో రాజధాని ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని స్పష్టం చేసింది. సాధారణంగా భూకంపాలు ఆసియా ఖండంలో ఎక్కువగా వస్తుంటాయి. భారత్ లోని జమ్మూ కశ్మీర్, పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, తజకిస్థాన్ లు హింద్ కుష్ హిమాలయన్ జోన్ కు చుట్టుపక్కల వీటి కేంద్రాలు ఉంటాయి. అత్యధిక భూకంపాలు నమోదయ్యే జోన్ల జాబితాలో ఈ జోన్ కూడా ఉంది. యూరేషియా ఫలకంతో భారత ఉపఖండ భూఫలకం ఢీకొనడమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.


Also Read: యూపీలో సెక్యూరిటీ హైఅలెర్ట్, అయోధ్య ఉత్సవానికి భారీ భద్రత - ఆ ప్రాంతాలపైనే ఫోకస్