Ram Mandir Opening:



భద్రత కట్టుదిట్టం..


అయోధ్య ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. యూపీలోని 7 జిల్లాల్లో సెక్యూరిటీ అలెర్ట్‌ ప్రకటించారు. నేపాల్‌తో సరిహద్దు పంచుకునే ప్రాంతాల్లోనూ అప్రమత్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అందుకే భద్రతా లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా మరింత పెంచారు. స్మగ్లింగ్ జరగకుండా అడ్డుకోనున్నారు. కొన్ని చోట్ల పోలీసులు డ్రోన్‌ కెమెరాలతో నిఘా పెడుతున్నారు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా వెంటనే అలెర్ట్ అయ్యేందుకు వీటిని వినియోగించనున్నారు. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా అన్ని ప్రాంతాలనూ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. భారత్ నేపాల్‌ సరిహద్దు వద్ద పహారా కాసే Sashastra Seema Bal (SSB) తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీళ్లతో పాటు యూపీ పోలీసులు భద్రతకు సహకరించనున్నారు. నేపాల్‌తో సరిహద్దు పంచుకుంటున్న ఆరు జిల్లాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. పిలిబిట్, లఖింపుర్ ఖేరి, బహ్రెయిచ్, శ్రావస్తి సహా మరి కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో భద్రత పెంచనున్నారు. ఇప్పటికే Central Industrial Security Force రంగంలోకి దిగింది. అయోధ్య ఎయిర్‌పోర్ట్ వద్ద 150 మంది సిబ్బంది పహారా కాస్తోంది. 


ఈ నెల 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున అయోధ్యకు చేరుకోనున్నారు. ఈ క్రమంలోనే  All India United Democratic Front (AIUDF) చీఫ్ బదరుద్దీన్ అజ్మల్ (Badaruddin Ajmal) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల రోజుల పాటు ముస్లింలు ఎవరూ రైళ్లలో ప్రయాణించొద్దని పిలుపునిచ్చారు. ముస్లింలపై దాడులు జరిగే ప్రమాదముందని  హెచ్చరించారు. అలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే రైలు ప్రయాణాన్ని మానుకోవడమే మంచిదని చెప్పారు. ఈ కార్యక్రమానికి కనీసం 60 వేల మంది తరలి వస్తారని అంచనా. ప్రధాని మోదీ చేతుల మీదుగా బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే అజ్మల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసోంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. జనవరి 20-25 వరకూ ముస్లింలు అంతా బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. 


"వాళ్లు (బీజేపీని ఉద్దేశిస్తూ) స్పెషల్ ట్రైన్స్‌ బుక్ చేసుకున్నారు. బస్సులూ బుక్ అయ్యాయి. రామ మందిర ఉత్సవానికి పెద్ద ఎత్తున భక్తుల్ని తరలిస్తున్నారు. జనవరి 20-25 వరకూ ముస్లింలు రైళ్లు, బస్‌లలో ప్రయాణించకపోవడమే మంచిది


- బదరుద్దీన్ అజ్మల్, AIUDF చీఫ్


దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు అయోధ్య పట్టణానికి పోటెత్తనున్నారు. యూపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలకూ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన భక్తులు రైలు మార్గంలో అయోధ్యకు చేరేందుకు వీలుగా రైల్వే సర్వీసులను భారీగా పెంచాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. రామ మందిరం తెరుచున్న తరవాత 100 రోజుల పాటు దేశంలోని పలు చోట్ల నుంచి 1000 రైళ్లు ప్రత్యేకంగా నడపనున్నట్టు వెల్లడించింది. 


Also Read: ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు! ఈ సారి పద్దులో అదే హైలైట్?