RCB Victory Parade Stampede: బెంగళరూలులో జరగబోయే ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదం నింపింది. దాదాపు పది మంది ప్రజలు ఈ దుర్ఘటనలో మృతి చెందారు. 50 మందికిపైగా గాయపడినట్టు సమాచారం అందుతోంది. చిన్నస్వామి స్టేడియం పరిసర ప్రాంతాలు పూర్తిగా ప్యాక్ అయిపోయాయి. గాయపడిన వాళ్లను ఆసుపత్రికి తరలించేందుకు కూడా కష్టమైపోయింది. ఇసుకవేస్తే రాలనంతగా జనం అక్కడ గుమిగూడారు. వారిని కంట్రోల్ చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. 

క్షమాపణలు చెప్పన డీకే శివకుమార్ దుర్ఘటన చాలా దురదృష్టకరమని కర్ణాటక డీసీఎం డికె శివకుమార్ అన్నారు. సరైన ఏర్పాట్లు చేసినప్పటికీ భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులను కంట్రోల్ చేయలేకపోయినట్టు పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే "ఆర్‌సిబి విజయం పట్ల చాలా గర్వంగా ఉంది. ఇది 18 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. తొక్కిసలాట దురదృష్టకరం. జనం భారీగా తరలి వచ్చారు. వారిని కంట్రోల్ చేయడంలో కష్టం. బెంగళూరు, కర్ణాటక ప్రజలందరికీ నేను క్షమాపణలు కోరుతున్నాను, మేము ఊరేగింపు నిర్వహించాలనుకున్నాం. కానీ జనం సందోహం కంట్రోల్ తప్పింది. " అని అన్నారు. 

కర్ణాటక ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న బిజెపిచిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటపై కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుంది బిజెపి . అమిత్ మాల్వియ మాట్లాడుతూ, "ఈ హృదయ విదారక ఘటనను నివారించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాలనా దృష్టి లేకపోవడం, జనాన్ని నియంత్రించడంలో వైఫల్యం కోలుకోలేని నష్టాన్ని కలిగించాయి. ఈ ఘటనకు బాధ్యత వహించాలి. ప్రమాదవశాత్తు కాదు, నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు కోల్పోయారు." అని మండిపడ్డారు. 

అంతకంటే ముందు విధాన సౌధాలో ఆర్సీబీ టీమ్‌ను సత్కరించారు డీకే.