ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో బెయిల్ మంజూరు అయింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చింది. రూ.లక్ష పూచీకత్తుపై ఈ బెయిల్ మంజూరు చేసింది. మార్చి 21న కేజ్రీవాల్‌ను లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.






రోస్ అవెన్యూ కోర్టులో వెకేషన్ జడ్జి న్యాయ్ బిందు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేశారు. తొలుత ఉదయం తీర్పు రిజర్వు చేసి సాయంత్రం తీర్పు ఇచ్చారు. ఈడీ తరపు న్యాయవాది జోహెబ్ హొస్సేన్ బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. అయితే ఆయన వినతిని కోర్టు తోసిపుచ్చింది.


మార్చి 21న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. మే నెలలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గడువు ముగియగానే కేజ్రీవాల్ జూన్ 2న లొంగిపోయారు. మధ్యంతర బెయిల్‌పై కేజ్రీవాల్ బయటకు వచ్చి ఎన్నికలకు ముందు 15 రోజుల పాటు ప్రచారం కూడా చేశారు.