Murder in Burger King: ఢిల్లీలో బర్గర్ కింగ్‌ స్టోర్‌లో (Burger King Murder) ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అందరూ చూస్తుండగానే ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. దాదాపు 40 సార్లు కసితీరా కాల్చి హత్య చేశారు. రాజౌరి గార్డెన్‌లో ఈ దారుణం జరిగింది. అప్పటి వరకూ మూమాలుగానే కూర్చున్న దుండగులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ముందుగా ఆ యువకుడిని వెనక నుంచి కాల్చారు. ఆ తరవాత 40 సార్లు కాల్చి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో స్టోర్‌లో కల్లోలం రేగింది. కస్టమర్స్ అంతా బయటకు పరుగులు పెట్టారు. బాధితుడు అమన్‌ ఓ యువతి పక్కనే కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో ఆ యువతి తన ఫోన్‌ చూపిస్తోంది. సరిగ్గా అదే సమయంలో కాల్పులు జరిగాయి. దాడి చేసిన వెంటనే బిల్ కౌంటర్ వైపు పరిగెత్తాడు అమన్. కానీ యువకుడిని వెంటాడి మరీ కాల్చారు. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో నిలబడి కాల్చినట్టు CC కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అప్పటి వరకూ బాధితుడి పక్కనే కూర్చున్న కాల్పుల శబ్దం వినబడగానే బయటకు పరిగెత్తింది. క్షణాల్లోనే స్టోర్ అంతా ఖాళీ అయిపోయింది. దాదాపు 38 బులెట్స్‌తో కాల్చినట్టు తేలింది. ఈ హత్యకి రెండు తుపాకులు వాడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై FIR నమోదు చేశారు. బర్గర్ కింగ్ స్టాఫ్ చెప్పిన వివరాల ప్రకారం హంతకులకు 25-30 ఏళ్ల వయసు ఉంటుంది. అయితే..2020లో హరియాణాలో జరిగిన ఓ హత్యకు ఇది ప్రతీకార హత్య అయ్యుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Continues below advertisement






ఇదే మిస్టరీగా ఉంది..


అమన్‌తో పాటు కూర్చున్న యువతి చాలా బలవంతం చేసి మరీ బర్గర్ కింగ్‌ స్టోర్‌కి రప్పించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ హత్యలో ఆమె హస్తం కూడా ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే విచారణ మొదలు పెట్టారు. ఆమెకీ క్రిమినల్ రికార్డ్ ఉందని తెలుస్తోంది. అమన్ మొబైల్‌తో పాటు వ్యాలెట్‌ని తీసుకుని అక్కడి నుంచి పారిపోయింది. పోర్చుగీసులో ఉన్న గ్యాంగ్‌స్టర్ హిమాన్షు ఈ హత్య చేయించినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. హిమాన్షు సోదరుడిని అమన్ చంపేశాడని, అందుకు బదులుగానే అమన్‌ని హత్య చేయించానని చెప్పాడు. తన సోదరుడి హత్యలో హస్తం ఉన్న వాళ్లందరినీ త్వరలోనే చంపేస్తానని హెచ్చరించాడు. ప్రస్తుతం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 


Also Read: Delhi Heat Waves: ఢిల్లీని హడలెత్తిస్తున్న వడగాలులు, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి -పెరుగుతున్న మరణాలు