Mirzapur 3 Trailer Out: దిగ్గజ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’. ఇప్పటి వరకు వచ్చిన రెండు సీజన్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సిరీస్ లోని క్యారెక్టర్లు అభిమానుల మదిలో నిలిచిపోయాయి. చాలా కాలంగా ‘మీర్జాపూర్’ సీజన్ 3 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా మూడో సీజన్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ కాగా, ఇప్పటికే విడుదలైన టీజర్ భారీగా అంచనాలు పెంచింది. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించి ట్రైలర్ ను వదిలారు మేకర్స్. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది.


గుడ్డూను టార్గెట్ చేసిన ఖాలీన్ భయ్యా, లోకల్ గ్యాంగ్స్


‘మీర్జాపూర్’ సీజన్ 2లో మున్నా(దివ్యేందు శర్మ)ను గుడ్డు(అలీ ఫజల్‌) చంపేస్తాడు. మీర్జాపూర్ పై పట్టు సాధిస్తాడు. ఇక తాజా ట్రైలర్ లో ఖాలీన్ భయ్యా(పంకజ్‌ త్రిపాఠి) చేతిలో ఉన్న మీర్జాపూర్‌ను గుడ్డు తన చేతిలోకి తెచ్చుకుంటాడు? అటు గుడ్డూను చంపి మీర్జాపూర్ మీద పెత్తనం చెలాయించాలని అక్కడి గ్యాంగ్స్ ఎలాంటి ఎత్తులు వేశాయి? వాటిని తిప్పి కొట్టేందుకు గుడ్డు ఎలాంటి ప్రయత్నం చేశాడు? అనేది చూపించారు. నిజానికి మీర్జాపూర్ సింహాసనాన్ని దక్కించుకునేందుకు ఖాలీన్ భయ్యాతో పాటు చాలా మంది గుడ్డూను టార్గెట్ చేస్తారు. వారందరినీ గుడ్డూ ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ సీజన్ లో చూడాలి.  “మీర్జాపూర్ సింహాసనం కోసం గతంలో ఎప్పుడూ చూడనిది చేయాల్సి వస్తోంది” అంటూ కాలీన్ భయ్యా నుంచి వచ్చే డైలాగ్ హైలెట్ గా నిలిచింది.   



రెండు సీజన్లకు మించి రక్తపాతం


నిజానికి ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ తొలి నుంచి విపరీతమైన హింసతో నిండి ఉంది. తొలి సీజన్ లో ఇంటిమేట్ సీన్లు కూడా ఉన్నాయి. రెండో సీజన్ కూడా ఇంచు మించు అలాగే ఉంది. కానీ, మూడో సీజన్ కు వచ్చే సరికి రక్తపాతం మరింతగా పెరిగింది. ట్రైలర్ చూడ్డానికి కూడా గత సీజన్ల మాదిరిగానే ఉన్నా, హింస మాత్రం ఇంకాస్త ఎక్కువగా ఉన్నట్లు అర్థం అవుతోంది.  


జూలై 5 నుంచి ‘మీర్జాపూర్’ సీజన్ 3 స్ట్రీమింగ్   


పంకజ్‌ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, అలీ ఫజల్‌, హర్షిత గౌర్‌, విజయవర్మ సహా పలువురు ఈ సిరీస్ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. గుర్మీత్‌సింగ్‌, మిహిర్ దేశాయ్ ఈ సీరిస్ ను తెరకెక్కిస్తున్నారు. ఎక్సెల్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్ ఈ సిరీస్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. రీసెంట్ గా విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ టీజర్ సిరీస్ మీద భారీగా అంచనాలు పెంచేసింది. తాజాగా విడుదలైన ట్రైలర్ మరింత బజ్ క్రియేట్ చేసింది. ‘మీర్జాపూర్’ తొలి సీజన్ 2018లో రాగా, రెండో సీజన్ 2020లో వచ్చింది. నాలుగేళ్ల తర్వాత రాబోతున్న మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జులై 5న పలు భాషల్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.


Read Also: సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని కాంబోలో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ, చేతులు కలిపిన దిగ్గజ నిర్మాణ సంస్థలు