Blast Reported Outside CRPF School In Delhi | ఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో పేలుడు ఘటన కలకలం రేపుతోంది. ఢిల్లీలోని రోహిణి జిల్లా ప్రశాంత్ విహార్ లోని సీఆర్పీఎఫ్ పాఠశాల బయట పేలుడు సంభవించింది. ఆదివారం ఉదయం 7:45 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించినట్లు తెలస్తోంది. స్కూల్ యాజమాన్యం వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకున్నాయి. స్కూల్ గోడలు దెబ్బతిన్నాయని.. అయితే పేలుడు దేని వల్ల సంభవించింది అని పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్కూల్ ముందు నిలిపి ఉన్న ఓ కారుతో పాటు సమీపంలో ఉన్న ఓ షాపు ధ్వంసం అయ్యాయి.


ప్రశాంత్ విహార్ లోని సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడు సంభవించిందని ఉదయం 07:47 గంటలకు ఫోన్ కాల్ వచ్చిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే స్టేషన్ ఆఫీసర్, సిబ్బందికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు ధాటికి పక్కనే పార్క్ చేసిన ఓ కారుతో పాటు, సమీపంలోనే ఉన్న దుకాణం అద్దాలు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు అవకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫోరెన్సిక్ టీమ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నాయి. ఫైరింజన్ సైతం అందుబాటులో ఉంచామని పోలీసులు తెలిపారు. 






రోహిణిలో పేలుడుపై డీసీపీ ఏమన్నారంటే..
ప్రశాంత్ విహార్ లోని సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడుపై రోహిణి డీసీపీ అమిత్ గోయల్ స్పందించారు. పేలుడు సంభవించిన విషయం నిజమే. అయితే ఏ రకమైన పేలుడు, అందుకు కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నాయని డీసీపీ తెలిపారు. 


Also Read: Kadapa Crime News: కడప జిల్లాలో పెట్రోల్‌ దాడికి గురైన విద్యార్థిని మృతి, గంటల వ్యవధిలో నిందితుడి అరెస్ట్