Delhi Pollution: 



అదే పరిస్థితి...


ఢిల్లీ వాసులకు పొల్యూషన్ (Delhi Pollution) బాధలు తప్పడం లేదు. దాదాపు వారం రోజులుగా ఈ తీవ్రత పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఇప్పటికీ ఇక్కడి వాయు నాణ్యత "Severe"కేటగిరీగానే ఉంది. Central Pollution Control Board ఈ విషయాన్ని వెల్లడించింది. ఇవాళ్టి ఉదయం (నవంబర్ 8) 7 గంటల సమయానికి ఢిల్లీలో AQI 421గా నమోదైంది. ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన రెండు Smog Towers మూసేసి ఉండడం మరింత వివాదాస్పదమైంది. ఇందులో ఒక టవర్ ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.23 కోట్లు ఖర్చు చేసింది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో దాన్ని మూసేసి ఉండటం సంచలమైంది. ఈ అంశం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మందలించింది. వాటిని తెరిచి కాలుష్యాన్ని కట్టడి చేయాలని సూచించింది.  Delhi Pollution Control Committee ఛైర్మన్ అశ్వినీ కుమార్‌కి సమన్లు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అప్రమత్తమైంది. కన్నాట్‌లోని స్మాగ్ టవర్‌ని తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 24 మీటర్ల పొడవున్న ఈ స్మాగ్‌ టవర్‌ని 2021లో ఏర్పాటు చేశారు. ఈ టవర్‌కి దాదాపు వెయ్యి క్యూబిక్ మీటర్ల మేర గాలిని శుద్ధి చేసే కెపాసిటీ ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ టవర్‌ని తెరిచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ (Gopal Rai) కీలక భేటీకి పిలుపునిచ్చారు. సంబంధిత అధికారులందరూ మీటింగ్‌కి హాజరు కావాలని ఆదేశించారు. రవాణాశాఖ మంత్రి కైలాశ్ గహ్లోట్, రెవెన్యూ మంత్రి అతిశి కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. 






ఆ ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్..


కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఆనంద్ విహార్, ద్వారకా, షాదీపూర్, మందిర్ మార్గ్, ITO తదితర ప్రాంతాలను ఎయిర్ మానిటరింగ్ సిస్టమ్స్‌ యాక్టివ్‌గా ఉన్నాయి. దాదాపు అన్ని చోట్లా AQI 400 కన్నా ఎక్కువగానే నమోదైంది. NCR, గ్రేటర్ నోయిడాపై ఈ ఎఫెక్ట్ ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తోంది. ఆనంద్ విహార్‌లో అయితే మరీ దారుణంగా AQI 999గా నమోదైంది. అంటే అక్కడి గాలి పీల్చితే విషం పీల్చుకున్నట్టే. ఢిల్లీతో పాటు పంజాబ్,ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలనూ మందలించింది సుప్రీంకోర్టు. రైతులు వరిగడ్డిని కాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. పంజాబ్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉండడం వల్ల ఆ ప్రభుత్వానికి సూచనలు చేసింది. వరికి ప్రత్యామ్నాయ పంటలూ వేసుకునేలా రైతుల్ని ప్రోత్సహించాలని స్పష్టం చేసింది. బాణసంచా కాల్చకుండా అవగాహన కల్పించాలని సూచించింది. 


Also Read: MOUs: భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య కీలక ఒప్పందాలు - విద్య, పరిశోధన రంగాల్లో పరస్పర సహకారం