Tmc Loksabha Candidates: పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections ) కు పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. బీజేపీ (Bjp) 195 మంది అభ్యర్థులతో తొలిజాబితాను ప్రకటిస్తే...కాంగ్రెస్ (Congress ) పార్టీ 39 మందితో మొదటి జాబితాను విడుదల చేసింది. తాజాగా టీఎంసీ (Tmc)42 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. టీమిండియా మాజీ ప్లేయర్ యుసుఫ్ పఠాన్ కు బెర్హంపూర్ పార్లమెంట్ టికెట్ కేటాయించింది.


కోల్ కత్తా నుంచి ఎన్నికల శంఖారావం పూర్తించిన టీఎంసీ


కోల్‌కతా వేదికగా ఆదివారం ఆ పార్టీ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇండియా కూటమిలో భాగమైనప్పటికీ.. రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు సీఎం, ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని బీజేపీ నేతలకు చురకలంటించారు మమతా బెనర్జీ. న్యాయ వ్యవస్థను గౌరవిస్తానన్న ఆమె...అయితే కొందరు బీజేపీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారంటూ కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయపై మమతా బెనర్జీ మండిపడ్డారు. 


టాలీవుడ్ నటికి హుగ్లీ పార్లమెంట్ టికెట్


పలువురు క్రికెటర్లు, బెంగాలీ, బాలీవుడ్, టాలీవుడ్ నటులకు అవకాశం ఇచ్చారు మమతా బెనర్జీ. ఎనిమిది మంది సిటింగ్‌లను పక్కన పెట్టేశారు. ఇద్దరు క్రికెటర్లు యుసుఫ్ పఠాన్, కీర్తి ఆజాద్ లకు పార్లమెంట్ టికెట్ ఇచ్చిన మమతా...టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన రచనా, బాలీవుడ్ ఒకప్పటి హీరో శత్రుగణ్ సిన్హాకు ఛాన్స్ ఇచ్చారు. టీమిండియా మాజీ ప్లేయర్ యుసుఫ్ పఠాన్ కు బెర్హంపూర్ పార్లమెంట్ టికెట్ కేటాయించింది. అసన్ సోల్ నుంచి శత్రుఘన్ సిన్హా, బెర్హంపూర్ నుంచి యుసుఫ్ పఠాన్, బసిరత్ నుంచి హజి నురులు ఇస్లాం, బుర్ద్వాన్ దుర్గాపూర్ నుంచి మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్, జాదవ్ పూర్ నుంచి సయాని ఘోష్, మేదినిపూర్ నుంచి జూన్ మాలియా, క్రిష్ణానగర్ నుంచి మహువా మెయిత్రా, తమ్లుక్ నుంచి దేబాన్షు భట్టాచార్యను బరిలోకి దించింది. 


కన్యాదానం నటికి హుగ్లీ పార్లమెంట్ సీటు
రచనా బెనర్జీ...హుగ్లీ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. తెలుగు, బెంగాళీ, ఓడియా, హిందీ, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించారు. రచనా తెలుగులో నేను ప్రేమిస్తున్నాను, రాయుడు, అభిషేకం, అంతా మనమంచికే, సుల్తాన్, బావగారు బాగున్నారా?, కన్యాదానం, మావిడాకులు చిత్రాల్లో నటించారు. సిద్దాంత మహాపాత్ర సరసన 40 సినిమాలు, ప్రసేన్ చటర్జీతో కలిసి 35 సినిమాల్లో నటించారు. 


2022లో టీఎంసీలో చేరిన కీర్తి ఆజాద్, శత్రుగన్ సిన్హా


2022లో టీఎంసీలో చేరిన శత్రుగన్ సిన్మా...బాబుల్ సుప్రియో ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో అసన్ సోల్ నుంచి పార్లమెంట్ కు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై 3లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన గతంలో కేంద్ర మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్...కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో పని చేశారు. 2022లో టీఎంసీలో చేరారు. కీర్తి ఆజాద్ గతంలో దర్బంగా నుంచి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. కీర్తి ఆజాద్..1983 ప్రపంచకప్ జట్టు సభ్యుడు