కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య ఉన్న వ్యవధిని తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఎన్‌టీఏఐజీ (నేషనల్​ టెక్నికల్​ అడ్వైజరీ గ్రూప్​ ఆఫ్​ ఇమ్యునైజేషన్​) చేసిన కీలక ప్రతిపాదనల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో ఇంక కొవిషీల్డ్ తొలి డోసు తీసుకున్న తర్వాత 8-16 వారాల మధ్యలో రెండో డోసుతీసుకువచ్చు. అంతకుముందు రెండు డోసుల మధ్య వ్యవధి 12-16 వారాలుగా ఉండేది.







అదే కారణం


ప్రపంచ దేశాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగానే ఈ ప్రతిపాదన చేసినట్లు అధికారులు తెలిపారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసును తొలి డోసు తీసుకున్న 8 వారాల నుంచే అందించడం ద్వారా యాంటీబాడీల యాంటీబాడీల స్పందనలో ఎలాంటి మార్పు లేదని పలు అధ్యయనాలు తెలిపాయి.


కొవాగ్జిన్ యథావిధిగా


భారత్​ బయోటెక్​ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా వ్యవధిపై ఎన్​టీఏఐజీ ఎలాంటి కొత్త ప్రతిపాదన చేయలేదు. కొవాగ్జిన్ మొదటి, రెండో డోసు మధ్య ప్రస్తుతం 28 రోజుల విరామం ఉంది.


కేంద్రం హెచ్చరిక


ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్.. ఫైవ్ ఫోల్డ్ స్ట్రాటజీ పాటించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్‌లకు తెలిపారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్-నిబంధనలను తప్పక పాటించాలన్నారు.



కరోనా జాగ్రత్తలు పాటించేలా చూడాలి. వీలైనన్నీ కరోనా శాంపిళ్లను ఇన్సాకాగ్‌కు పంపాలి. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) జారీ చేసిన ప్రొటోకాల్ ప్రకారం కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి శాంపిళ్లను ఎక్కువగా పంపాలి. దీని వల్ల కొత్త వేరియంట్లను గుర్తించవచ్చు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం టెస్టింగ్ విధానాలను పాటించాలి.                                                                   "
-రాజేశ్ భూషణ్, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి



Also Read: Fourth Covid Wave: మామా మనం సేఫ్! ఎన్ని కొవిడ్ వేవ్‌లు వచ్చినా పర్లేదట!


Also Read: UP Auto Accident: బెలూన్ తగిలి ఆటో బోల్తా- ఇదేం హోలీరా నాయనా!