Covid Update: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. కొత్తగా 16,678 కరోనా కేసులు నమోదయ్యాయి. 26 మంది మృతి చెందారు. తాజాగా 14,629 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రికవరీ రేటు 98.51 శాతానికి పడిపోయింది. డైలీ పాజిటివిటీ రేటు 5.99 శాతానికి పెరిగింది.
- మొత్తం కేసులు: 43,639,329
- మొత్తం మరణాలు: 5,25,454
- యాక్టివ్ కేసులు: 1,30,713
- మొత్తం రికవరీలు: 4,29,83,162
వ్యాక్సినేషన్
దేశంలో తాజాగా 11,44,145 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,98,88,77,537కు చేరింది. మరో 2,78,266 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ.
Also Read: Tamilnadu Politics: పన్నీర్ సెల్వంకు కోర్టు షాక్! జనరల్ మీటింగ్‌కు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Also Read: Telescope History: తొలితరం టెలిస్కోపులు ఎలా ఉండేవి - అవి ఎలాంటి ఫలితాలు ఇచ్చాయంటే ?