Covid Cases In India: భారత్‌లో కరోనా వైరస్ శాంతించినట్లు కనిపిస్తోంది. నిన్నటితో పోల్చితే దేశంలో  27,469 పాజిటివ్ కేసులు తక్కువ నమోదయ్యాయి. ఈ క్రమంలో వరుసగా ఐదోరోజూ కరోనా కేసులు 3 లక్షలకు పైగా నిర్ధారణ అయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 3,06,064 (3 లక్షల 6 వేల 64)  మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో మరో 439 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. 







నిన్న ఒక్కరోజులో 2,43,495 (2 లక్షల 43 వేల 495) మంది కరోనాను జయించారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 22,49,335కు చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 20.75 శాతానికి పెరిగినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. భారత్‌లో కొవిడ్ డోసుల పంపిణీ 162.73 కోట్ల మైలురాయికి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా వద్ద మరో 13.83 కోట్ల డోసుల వరకు నిల్వ ఉన్నాయని తెలిపింది. 







ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్ల మందికి ఇప్పటివరకూ కరోనా సోకింది. 55.9 లక్షల మందిని కొవిడ మహమ్మారి బలిగొనగా.. 979 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ప్రజలు తీసుకున్నారని ప్రముఖ జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తాజాగా తెలిపింది.


 Also Read: Gold Silver Price Today 24 January 2022 : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు, స్థిరంగా వెండి... ప్రధాన నగరాల్లో ఇవాళ్టి ధరలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి