Corona Cases India: దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. శనివారం (ఏప్రిల్ 1) దేశంలో 3824 కొత్త కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. రోజువారీ కేసుల పరంగా ఇది 6 నెలల్లో అత్యధిక సంఖ్య. అదే సమయంలో గత ఏడు రోజుల్లో కరోనా కేసులు పెరిగిన విధానం మూడవ వేవ్ తర్వాత అత్యధికం. మార్చి 26 నుంచి ఏప్రిల్ 1వ తేదీ చివరి వారంలో భారత దేశంలో 18,450 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే ఈ సంఖ్య అంతకు ముందు వారంలో 8,781 కంటే రెండింతలు ఎక్కువ. కరోనా కేసుల రెట్టింపు సమయం 7 రోజుల కంటే తక్కువగానే ఉంది. థర్డ్ వేల్ లోనే ఈ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే ఈ సమయంలో కరోనా కారణంగా మృతుల సంఖ్య స్వల్పంగా పెరగడం  కాస్త ఉపశమనం కలిగించే విషయం. గత వారం కరోనా కారణంగా 36 మంది మరణించారు. అయితే అంతకు ముందు ఈ సంఖ్య 29.


కేరళలో అత్యధిక వృద్ధి


గత ఏడు రోజుల్లో రెట్టింపు కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది. కేరళలో కరోనా కేసుల సంఖ్య ఒక వారంలో 1333 నుండి దాదాపు 4000కి మూడు రెట్లు పెరిగింది. గోవా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ లలో కోరనా వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ రాష్ట్రాల్లో గత వారంతో పోలిస్తే ఈ వారంలో కరోనా కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. గత వారం హిమాచల్ ప్రదేశ్‌లో కరోనా కేసులు 409 నుండి 1200కి పెరిగాయి.
రెండో స్థానంలో మహారాష్ట్ర 


మహారాష్ట్ర, గుజరాత్‌లలో గత కొన్ని వారాలుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే మహారాష్ట్రలో స్థిరంగా ఉండగా గుజరాత్‌లో తగ్గింది. మహారాష్ట్రలో ఈ వారం కరోనా కేసుల సంఖ్య 3323, ఇది గత ఏడు రోజుల్లో (1956 కేసులు) నమోదైన కేసుల కంటే 70 శాతం ఎక్కువ. ఆదివారం (ఏప్రిల్ 2) ఒక్కరోజే కరోనాతో ముగ్గురు చనిపోగా.. 550కి పైగా కేసులు నమోదయ్యాయి. హర్యానాలో పెరుగుతున్న కొవిడ్ -19 కేసులతో పాజిటివిటీ రేటు 4 శాతానికి చేరుకుంది. ఆరోగ్య శాఖ అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ కోరారు. నిన్న వైద్యారోగ్య శాఖ సీనియర్ అధికారుల సమావేశం కూడా జరిగింది. రాష్ట్రంలో శనివారం సాయంత్రం విడుదల చేసిన కొవిడ్-19 బులెటిన్‌లో 579 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.


తమిళనాడు-కర్ణాటకలో పెరుగుతున్న కేసులు..


కరోనా ఇన్ఫెక్షన్ పాజిటివ్ కేసుల పెరుగుదల దృష్ట్యా, తమిళనాడు ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఫేస్ మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 1న రాష్ట్రంలో 123 మందికి కరోనా సోకింది. కర్ణాటకలో యాక్టివ్ కొవిడ్-19 కేసులు 1,400 మార్కును దాటాయి. మినీ థామస్ నివేదిక ప్రకారం.. మొత్తం కేసుల్లో 59 శాతం బెంగళూరులోనే నమోదయ్యాయి. ఏప్రిల్ 1న రాష్ట్రంలో 284 కొత్త కేసులు నమోదయ్యాయి.


ఒక్క ముంబైలోనే 172 కేసులు నమోదు


మహారాష్ట్రలో దాదాపు 550 కేసుల్లో 172 కేసులు ఒక్క ముంబైలోనే నమోదయ్యాయి. ఏప్రిల్ 2వ తేదీన ముంబైలో మొత్తం 172 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారిక బులెటిన్‌లో తెలిపింది. అదే సమయంలో రోగుల కోలుకునే రేటు 98.2 శాతంగా ఉంది.


భారతదేశంలో కరోనా 


ఆదివారం (ఏప్రిల్ 2) ఉదయం 8 గంటల వరకు భారతదేశంలో 3,824 కరోనా కేసులు నమోదయ్యాయి. 184 రోజుల్లో ఇదే అత్యధిక కేసులు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 18,389కి పెరిగింది. ఇంతలో ఐదు కొత్త మరణాలతో.. మరణాల సంఖ్య 5,30,881 కు పెరిగింది. అలాగే మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.47 కోట్లకు చేరుకుంది. 


తక్కువ ప్రమాదకరమైనది కాదు


దేశంలో కరోనా కేసులు పెరగడం ఇది వరుసగా 7వ వారం. మనం కరోనాను చులకనగా చూడడం.. ఆ మనకేం వస్తుందిలే అనుకోవడంతో దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ కరోనా కేసులు పెరగడం అందరిలోనూ ఆందోళన కల్గిస్తోంది. కాబట్టి జాగ్రత్త.