ప్రతినెల 1న గ్యాస్‌ సిలిండర్ల ధరలపై నిర్ణయం తీసుకునే  ఆయిల్ కంపెనీలు ఈసారి కూడా పెంచాయి. ఆయితే ఇప్పటికి మాత్రం గృహ వినియోదారులపై భారం పడకుండా ఆయిల్ కంపెనీలు కనికరించాయి. ఓన్లీ కమర్షియల్ సిలిండర్‌పైనే భారం వేశాయి.


కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. కమర్షియల్‌కు వాడే సిలిండర్‌పై 104 రూపాయలు వడ్డించాయి. ప్రతి నెల 1న సిలిండర్‌పై ధరలు ఈ కంపెనీలు సవరిస్తుంటాయి. ఈ నెల కూడా సవరించాయి. ఈసారి కమర్షియల్‌ సిలిండర్‌పైనే భారీగా వడ్డించాయి. 


ఈ నెల వేసిన భారంతో కమర్షియల్ సిలిండర్ ధర ఒక్కో సిటీలో ఒక్కోలా ఉంది. దిల్లీలో పెరిగిన ధరతో సిలిండర్‌ కాస్ట్‌ 2,355 రూపాయలుగా ఉంటే.. కోల్‌కతాలో 2477.50 రూపాయలు ఉంది. ముంబయిలో 2329.50లకు సిలిండర్ కోనాల్సి వస్తోంది. చెన్నైలో 2729 రూపాయలు వెచ్చించాలి. 


ప్రస్తుతం గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్‌ కాస్ట్‌ చూస్తే... దిల్లీ, ముంబైలో 949.5, చెన్నైలో 965.50 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది.