చెన్నై: తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 717 లిక్కర్ షాపులు మూసివేయాలని ముఖ్యమంత్రి విజయ్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రార్థనా మందిరాలు, విద్యాసంస్థలు, బస్టాండ్లకు 500 మీటర్ల దూరంలో ఉన్న ఈ మద్యం దుకాణాలు 2 వారాల్లోగా మూసివేయాలని గడువు ఇచ్చారు. 

Continues below advertisement

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన మార్క్ పాలన కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళగ వెట్రి కళగం (TVK) ఎన్నికల హామీలో మహిళల భద్రత, మద్యపాన రహిత తమిళనాడు లాంటి పలు విషయాలు ప్రస్తావించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉచిత విద్యుత్, మహిళల రక్షణ కోసం ప్రత్యేక పోలీస్ టీమ్స్, డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ లాంటి ఫైళ్లపై ఆయన సంతకాలు చేయడం తెలిసిందే. తమిళనాడు వ్యాప్తంగా పోలీసు అధికారులు డ్రగ్స్ నిరోధక చర్యలు తీసుకుంటున్నారు. అక్రమ మద్యం అమ్మకాలు, అక్రమ లిక్కర్ షాపులపై కూడా చర్యలు తీసుకుంటున్నారు.

Continues below advertisement

717 మద్యం దుకాణాలు బంద్ చేయాలని విజయ్ నిర్ణయం

ముఖ్యమంత్రి విజయ్ టాస్మాక్ దుకాణాల గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై తొలిరోజు ప్రజల్లో చర్చ జరిగింది. మద్యం కారణంగా తమిళనాడులో 18 ఏళ్లలోపు పిల్లల నుంచి యువత చాలా మంది ఈ వ్యసనానికి బానిసలుగా మారుతున్నారని చర్యలు చేపట్టారు. తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) ఆధ్వర్యంలో  రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనా స్థలాలు, స్కూల్స్ వద్ద లిక్కర్ షాపులు మూసివేయాలని ఆదేశించారు. సీఎం విజయ్‌ నిర్ణయంతో 717 మద్యం దుకాణాలు త్వరలో మూతపడనున్నాయి. 2 వారాల్లోగా ఇవి మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

తమిళనాడు ప్రభుత్వానికి టాస్మాక్ ప్రధాన ఆదాయ వనరులలో టాస్మాక్ మద్యం దుకాణాలు ఒకటి. క్ దుకాణాలను మూసివేసే ప్రకటన వెలువడింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం టెంపుల్స్, మసీదులు, చర్చిలు, స్కూల్స్, కాలేజీలతో పాటు బస్టాండ్‌లకు 500 మీటర్ల పరిధిలో ఎలాంటి లిక్కర్ షాపులు కనిపించకూడదు. 

ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో.. ‘తమిళనాడు రాష్ట్ర వాణిజ్య సంస్థ (TASMAC) ప్రస్తుతం 4,765 మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. వాటిలో, ప్రార్థనా స్థలాలు, విద్యాసంస్థలతో పాటు బస్ స్టాప్‌లకు 500 మీటర్ల దూరంలో ఉన్న వాటిని  గుర్తించాలని తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ఆదేశించారు. ఈ మేరకు ఈ 3 కేటగిరీల్లో మొత్తం 717 లిక్కర్ షాపులు ఉన్నట్లు గుర్తించారు.

విజయ్ నిర్ణయంపై ప్రజలు హర్షం..

ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రార్థనా స్థలాలకు దగ్గరగా 276 లిక్కర్ షాపులు, విద్యాసంస్థల దగ్గర్లో ఉన్న 186 దుకాణాలు, బస్టాప్‌ల సమీపంలో ఉన్న 255 లిక్కర్ షాపులు సహా మొత్తం 717  లిక్కర్ షాపులు వచ్చే రెండు వారాల్లో (14 రోజుల్లోగా) మూసివేయాలని సీఎం జోసెఫ్ విజయ్ ఆదేశించారు’ అని పేర్కొన్నారు. సీఎం విజయ్ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా.. ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా స్వాగతిస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉన్న మద్యం దుకాణాల మూసివేతపై విజయ్ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో సంచలనంగా మారింది.