బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి మోదీతో ద్వైపాక్షిక చర్చలకు చైనా ప్రయత్నించినట్టు వార్తలు వస్తాయి. అయితే మోదీ మాత్రం ఓకే చెప్పలేదని అనధికారికంగా సమావేశమై కొన్ని విషయాలు చర్చించినట్టు చెప్పుకుంటున్నారు. 


ప్రధాని మోదీతో అధికారికంగా మాట్లాడాలని చైనా అభ్యర్థించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. అయితే అనధికారికంగా సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. 


భారత్‌తో ద్వైపాక్షిక సమావేశం చైనా అభ్యర్థించింది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో లీడర్స్ లాంజ్‌లో అనధికారికంగా మాట్లాడుకున్నారు. అని విదేశాంగ మంత్రిత్వశాఖ వర్గాలు చెబుతున్నాయి.