Zero GST On insurance:ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీఎస్టీలో మార్పులు చేర్పు చేస్తున్నట్టు ప్రకటించారు. కేవలం రెండు స్లాబ్‌లు మాత్రమే ఉంటాయని తెలిపారు. దీంతో ఏ వస్తువులపై ఏ స్థాయిలో జీఎస్టీ విధిస్తారు, జరిగే మార్పులు ఏంటని చాలా మంది లెక్కలు వేస్తున్నారు. ఈటైంలో మంత్రుల బృందం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్సూరెన్స్‌పై జీరో జీఎస్టీని కేంద్రం ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తోంది. లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్‌పై మంత్రుల బృందం తన నివేదికను జీఎస్టీ కౌన్సిల్‌కు సమర్పించనుంది. ఈ నివేదికలో వ్యక్తులు తీసుకునే ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ తగ్గిస్తే ప్రయోజనం ఉంటుందని సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని మంత్రుల బృందం కన్వీనర్ సామ్రాట్ చౌదరి ప్రకటించారు.
ప్రస్తుతం హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్‌పై 18 శాతం జీఎస్టీని విధిస్తున్నారు. ఇకపపై వ్యక్తులు తీసుకునే ఇన్సూరెన్స్‌పై జీరో జీఎస్టీ విధించాలని కేంద్రం కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చినట్టు సామ్రాట్ చౌదరి పేర్కొన్నారు." బీమా రంగంలో వ్యక్తిగత, కుటుంబానికి తీసుకొనే జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్టీ మినహాయించాలని కేంద్రం ప్రతిపాదన చేస్తోంది. దీనిపై చర్చించాం. మంత్రుల బృందం తన నివేదికను జీఎస్టీ కౌన్సిల్‌కు అందచేస్తుంది"అని చౌదరి పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు సభ్యులంతా ఆమోదించారు. కొన్ని రాష్ట్రాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనని తుది నిర్ణయం మాత్రం కౌన్సిల్ తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. ఈ రాష్ట్ర మంత్రుల బృందంలో 13మంది సభ్యులు ఉన్నారు. వారికి సామ్రాట్ చౌదరి కన్వీనర్‌గా ఉన్నారు. ఈ బృందాన్ని కేంద్రం సెప్టెంబర్‌లో కేంద్రం నియమించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ, గోవా, గుజరాత్, మేఘాలయ, రాష్ట్రాల మంత్రులు ఉన్నారు.