Tehreek-e-Hurriyat Banned:
తెహ్రీక్‌పై నిషేధం..
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఇస్లామిక్ పాలనను తీసుకురావాలని కుట్ర చేస్తున్న Tehreek-e-Hurriyat (TeH)పై నిషేధం విధించింది. చట్టవిరుద్ధమైన సంస్థల జాబితాలో చేర్చింది. Unlawful Activities (Prevention) Act కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. అంతకు ముందు ఈ సంస్థకి సయ్యద్ అలీషా గిలానీ నడిపించే వాడు. గిలానీ చనిపోయిన తరవాత అది వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. తెహ్రీక్ ఇ హరియాత్ సంస్థ దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తోందని, భారత్ నుంచి జమ్ముకశ్మీర్‌ని వేరు చేయాలని కుట్ర చేస్తోందని తేల్చి చెప్పారు. జమ్ముకశ్మీర్‌ని తమ హస్తగతం చేసుకోడానికి కుట్ర జరుగుతోందని స్పష్టం చేశారు. కానీ ప్రధాని మోదీ హయాంలో ఉగ్రవాదాన్ని ఉపేక్షించేదే లేదని వెల్లడించారు.
"భారత్ నుంచి జమ్ముకశ్మీర్‌ని వేరు చేయాలని కుట్ర జరుగుతోంది. అక్కడ పూర్తిగా ఇస్లాం పాలన తీసుకురావాలని చూస్తున్నారు. భారత్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో పాటు ఉగ్రకార్యకలాపాలను పెంచాలని చూస్తున్నారు. కానీ మోదీ హయాంలో ఇదంతా కుదరదు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తున్నాం. భారత్‌కి వ్యతిరేకంగా విద్వేషాలు ప్రచారం చేసేది వ్యక్తైనా, సంస్థైనా అసలు సహించం"
- అమిత్‌షా, కేంద్ర హోం మంత్రి
మరో సంస్థపైనా బ్యాన్..
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం Muslim League Jammu Kashmir సంస్థని బ్యాన్ చేసింది. దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు నిషేధం విధించింది. ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టి ఇస్లాం పాలన తీసుకురావాలని కుట్ర చేసినట్టు తెలిపింది. భారత్‌కి వ్యతిరేకంగా...పాకిస్థాన్‌కి మద్దతుగా ప్రచారం చేస్తున్నందుకు ఈ నిషేధం విధించినట్టు స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్‌ని భారత్ నుంచి పూర్తిగా వేరు చేయాలని చూస్తున్నారని మండి పడింది.