Smriti Irani on Buddhist Development Plan: బౌద్ధ సమాజం అభివృద్ధి కోసం రూ.225 కోట్ల విలువైన 38 ప్రాజెక్టులకు కేంద్ర మైనారిటీ వ్యవహారాలు, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆదివారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమ్ కింద ఈ ప్రాజెక్టులను అమలు చేస్తున్నారు. బౌద్ధుల అభివృద్ధి, శ్రేయస్సు కోసం ప్రభుత్వం బౌద్ధ సమాజ అభివృద్ధి ప్రణాళికకు శ్రీకారు చుట్టిందన్నారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.
ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లలో బౌద్ధ అభివృద్ధి పథకం కింద ఈ ప్రాజెక్టులను ప్రారంభించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
డీయూ సీఐబీఎస్ కు రూ.30 కోట్ల ఆర్థిక సాయం
'హెరిటేజ్‌తో అభివృద్ధి', 'వారసత్వాన్ని గౌరవించడం' అనే ప్రస్తుత ప్రభుత్వ భావనకు అనుగుణంగా, ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బౌద్ధ స్టడీస్ (సిఐబిఎస్) ను బలోపేతం చేయడానికి మైనారిటీ వ్యవహారాల మంత్రి రూ.30 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. భాషా పరిరక్షణ, బౌద్ధ జనాభా నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించనున్నారు.
అభివృద్ధి చెందిన భారతదేశం' లక్ష్యానికి అనుగుణంగా, బౌద్ధ సాంస్కృతిక వారసత్వం, జ్ఞానాన్ని పరిరక్షించడానికి సిఐబిఎస్, ఇతర ప్రధాన సంస్థలు సహకరించాలని మంత్రి స్మృతి ఇరానీ ఆకాంక్షించారు. దీని వారికి ఆధునిక విద్యను అందించవచ్చు అని అభిప్రాయపడ్డారు.
సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్, కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జాన్ బార్లా, సంబంధిత రాష్ట్రాల మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, ఇతర వ్యక్తుల సమక్షంలో ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
బౌద్ధ సమాజ అభివృద్ధి పథకం కింద ఈ రాష్ట్రాల్లో ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు.
బౌద్ధ సమాజ అభివృద్ధి పథకం కింద అరుణాచల్ ప్రదేశ్‌కు రూ.41 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులను, సిక్కింకు రూ.43.98 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులను ప్రభుత్వం అంకితం చేసిందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌కు రూ.25 కోట్ల 45 లక్షల విలువైన 11 ప్రతిపాదనలు, ఉత్తరాఖండ్‌కు రూ.15 కోట్ల 14 లక్షల విలువైన 3 ప్రతిపాదనలు, లద్దాఖ్‌కు రూ.14 కోట్ల 50 లక్షల విలువైన 2 ప్రతిపాదనలు అందించామన్నారు.