Manipur Violence:
బెంగాల్‌లో హింస కనిపించలేదా: అనురాగ్ ఠాకూర్
INDIA కూటమికి చెందిన 21 మంది ఎంపీలు మణిపూర్ పర్యటనకు వెళ్లడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇదంతా షో ఆఫ్ కోసమే అని సెటైర్లు వేసింది. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కాస్త ఘాటుగానే స్పందించారు. విపక్షాల ఎంపీలు ముందు బెంగాల్, రాజస్థాన్‌కి వెళ్తే బాగుంటుందని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి బెంగాల్ వెళ్లి అక్కడి పరిస్థితులు గమనించాలని తేల్చి చెప్పారు. అక్కడ పంచాయతీ ఎన్నికల్లో ఎంత హింస జరిగిందో కనిపించలేదా అని మండి పడ్డారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్రిమినల్స్‌కి ఆశ్రయమిస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే ఆమె సీఎం పదవి నుంచి దిగిపోయే రోజులు వస్తాయని స్పష్టం చేశారు.
"మణిపూర్‌కి వెళ్లిన ఎంపీలది కేవలం షోఆఫ్ మాత్రమే. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా మణిపూర్‌లో ఇలాంటి అల్లర్లు చెలరేగాయి. అప్పుడు ఏమీ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఆ రాష్ట్రానికి వెళ్లి హడావిడి చేస్తున్నారు. వాళ్లు మణిపూర్ నుంచి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి బెంగాల్‌కి వెళ్లి పర్యటించాలని నా విజ్ఞప్తి. అక్కడ పరిస్థితులనూ సమీక్షించాలని కోరుకుంటున్నాను. రాజస్థాన్‌లో మహిళలపై ఎలా దాడులు జరుగుతున్నాయో కూడా తెలుసుకోవాలి. ఇండియా కూటమి ఎంపీలు రాజస్థాన్‌కి కూడా వెళ్తారో లేదో చెప్పాలి"
- అనురాగ్ ఠాకూర్, కేంద్రమంత్రి