BJP Congress Poster War:
పోస్టర్ వార్..
లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్, బీజేపీ మధ్య యుద్దం తీవ్రమవుతోంది. కాంగ్రెస్‌కి పెద్ద దిక్కుగా ఉన్నారు రాహుల్ గాంధీ. ఆయనే అన్ని సమావేశాలు, సభలకు హాజరవుతున్నారు. బీజేపీని..ముఖ్యంగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. ఫీల్డ్‌లోనూ చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. కాంగ్రెస్ క్యాంపెయినింగ్ కూడా కాస్త దూకుడుగానే సాగుతోంది. సోషల్ మీడియాలోనూ బీజేపీని కవ్వించే పోస్ట్‌లు పెడుతోంది. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. "అబద్ధాల కోరు" అంటూ మోదీ ఫొటోను షేర్ చేసింది. త్వరలోనే ఎన్నికల ర్యాలీలకు సిద్ధం అంటూ వెల్లడించింది. ఆ తరవాత మరో ఫోటోనీ షేర్ చేసింది. అందులోనూ ప్రధాని మోదీని టార్గెట్ చేసింది. ఇవి బీజేపీయేతర వర్గాల్లోకి బాగానే వెళ్లాయి.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఇదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. రాహుల్ గాంధీకి పది తలలు అతికించి రావణుడు అంటూ ఓ పోస్ట్ పెట్టింది. ధర్మాన్ని నాశనం చేసే వ్యక్తి, భారత్ వ్యతిరేకి అంటూ స్ట్రాంగ్‌గా రిప్లే ఇచ్చింది. ఇలా రెండు పార్టీల మధ్య పోస్టర్ వార్ మొదలైంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ పోస్ట్ చేసిన ఫొటో హింసని ప్రేరేపించే విధంగా ఉందని మండి పడ్డారు. రాహుల్ గాంధీని రావణుడిగా డిజైన్ చేసి పోస్ట్ చేసే ధైర్యం ఎక్కడిది అంటూ ప్రశ్నించారు.
"రాహుల్ గాంధీని రావణుడితో పోల్చుతూ బీజేపీ ఇలా పోస్టర్ పోస్ట్ చేయడం సిగ్గు చేటు. ఇది కచ్చితంగా హింసని ప్రేరేపించడమే అవుతుంది. ఆయనపై దాడి చేయాలని ఎవరినో రెచ్చగొట్టినట్టే అనిపిస్తోంది. ప్రధాని మోదీకి పర్సనాలిటీ డిజార్డర్ ఉందనడానికి ఇదే నిదర్శనం. ఆయన అబద్ధాల కోరు అన్న మాట నిజమే. రాహుల్‌ని ఇలా పోల్చడం అసలు అంగీకరించం"
- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత
ప్రియాంక గాంధీ కూడా ఈ పోస్ట్‌పై స్పందించారు. రాజకీయాల కోసం ఇంకా ఎంత దిగజారిపోతారంటూ మండి పడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డాని ట్యాగ్ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. హింసని ప్రేరేపించే విధంగా ఉన్న ఇలాంటి పోస్ట్‌లను పెట్టడమేంటని ప్రశ్నించారు.