Bihar Election 2025 Result: బిహార్ ఎన్నికలు 2025 కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రతి రౌండ్‌తో జేడీయూ, బీజేపీల ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి ఆధిక్యం పెరుగుతోంది. ఎన్టీయే కూటమి దాదాపు డబుల్ సెంచరీ వైపు పరుగులు తీస్తోంది. ఈ క్రమంలో భారతదేశంలో అధికారంలో ఉన్న పార్టీ, కూటమిగానీ ఇంత భారీ మెజార్టీ ఎక్కడైనా సాధించాయా అని చర్చ జరుగుతోంది. ఎందుకంటే బిహార్ ఓటర్ల తీర్పుతో గతంలో ఇలాంటి ఫలితాలు ఎక్కడ వచ్చాయి, వాటి ఫలితాల కోసం నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం బిహార్ లో 243 సీట్లకు గానూ ఎన్టీయే కూటమి 190 సీట్లలో ఆధిక్యంతో ఉండగా, మహాకూటమి 50 సీట్లు, ఇతరులు 3 చోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

Continues below advertisement

ఈసారి బిహార్‌లో ఏం జరిగింది..

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 కౌంటింగ్ కొనసాగుతోంది. 243 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతుండగా ఎన్టీయే కూటమి పార్టీలు ఎర్లీ ట్రెండ్స్ లో భారీ మెజారిటీ సాధించాయి. ఈసారి ప్రజలు అధికార కూటమికి మరోసారి అవకాశం ఇచ్చారు. అయితే గత కొన్ని దశాబ్దాలుగా బిహార్ లో ఇలాంటి ఫలితాలు రాలేదు. నితీష్ కుమార్ పరిపాలనకు పూర్తిస్థాయిలో మార్కులు వేశారు బిహార్ ప్రజలు.

Continues below advertisement

అధికార పార్టీలకు చాలాసార్లు అవకాశం 

బిహార్ రాజకీయాల్లో ఈ ప్రశ్న తలెత్తుతోంది. ఇక్కడి ఎన్నికల మూడ్ తరచుగా కేంద్ర రాజకీయాలపై ప్రభావం చూపుతుంది. బిహార్ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి 2024 వరకు చాలా రాష్ట్రాలు అధికార పార్టీలు, అధికార కూటమికి అవకాశం ఇచ్చాయి. అయితే కొన్ని రాష్ట్రాలు ప్రతి ఎన్నికలలో మార్పును కోరుకునేవి. ఏయే రాష్ట్రాలు అధికార పార్టీకి నిరంతరం మద్దతు ఇచ్చాయో చూద్దాం.

1952 నుండి 1971 వరకు కాంగ్రెస్ పార్టీకి స్వర్ణ యుగం

స్వాతంత్ర్యం వచ్చిన ప్రారంభ సంవత్సరాల్లో దాదాపు భారతదేశమంతా కాంగ్రెస్ అధికారంలో ఉండేది. 1952, 1957, 1962, 1967, 1971 ఈ ఎన్నికలన్నింటిలోనూ చాలా రాష్ట్రాలు కాంగ్రెస్‌కు మళ్లీ మళ్లీ అధికారాన్ని ఇచ్చాయి. బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, దాదాపు ప్రతి పెద్ద రాష్ట్రం ఈ సమయంలో అధికార పార్టీకే మరోసారి ఛాన్స్ ఇచ్చింది. 

1977లో కీలక మలుపు

ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అది దేశ రాజకీయాల్లో భారీ మార్పు తీసుకొచ్చింది. బిహార్, యూపీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా వంటి ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేసింది. పలు రాష్ట్రాలు సమిష్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని మార్చేస్తాయని మొదటిసారిగా పెద్ద సంకేతం ఇచ్చాయి.

1980లో మళ్ళీ కాంగ్రెస్ కం బ్యాక్

1977 తర్వాత,దేశంలోని చాలా రాష్ట్రాలు 1980లో ఇందిరా గాంధీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చాయి. బిహార్, యూపీ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో కాంగ్రెస్ విశేషంగా రాణించింది.

1984లో అతిపెద్ద అల

ఇందిరా గాంధీ హత్య తర్వాత వచ్చిన సానుభూతి ఓట్లు కాంగ్రెస్‌కు ఇప్పటివరకు అతిపెద్ద విజయాన్ని అందించాయి. బిహార్‌తో సహా దాదాపు ప్రతి రాష్ట్రం అధికార పార్టీకి రికార్డు మెజారిటీ ఇచ్చింది. నేడు బిహార్ కౌంటింగ్ తిరుగుతున్న తీరు 1984 పరిస్థితులను గుర్తుకు తెస్తుంది. 

2014, 2019లో మోదీ డబుల్ విజయం

2014లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత, 2019లో చాలా రాష్ట్రాలు మళ్ళీ అధికార పార్టీకి ఓటేశాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ప్రధాని మోదీపై మళ్ళీ నమ్మకం ఉంచాయి. బిహార్‌లో కూడా ఎన్‌డీఏకు వరుసగా రెండు లోక్‌సభ ఎన్నికల్లో బలమైన మద్దతు లభించింది.

2024లో తీవ్రమైన పోటీ

2024లో దేశంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే చాలా రాష్ట్రాల్లో అధికార వ్యతిరేకత కనిపించింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఫలితాలు ఆశ్చర్యం కలిగించినా.. బిహార్, ఒడిశా, అస్సాం వంటి రాష్ట్రాల్లో అధికార కూటమికి బలం చేకూరింది. ప్రస్తుతం బిహార్‌లో ట్రెండ్స్ గమనిస్తే.. దేశంలోని రాష్ట్రాలు సైతం ప్రతి ఎన్నికల్లో తమ ఇష్టాన్ని చూపుతూ అధికార పార్టీకి మళ్లీ ఓటేస్తాయని చెప్పవచ్చు.