Srhree Ram Mandir News: అంగరంగవైభవంగా ప్రాణప్రతిష్ఠాపనా మహోత్సవం పూర్తైన తర్వాత ఈ రోజు నుంచి అయోధ్య బాలరాముడు సామాన్య భక్తులకు దర్శనమిస్తున్నారు. సోమవారం వీఐపీల రాకతో సామాన్యులను అయోధ్యలోకి అనుమతించని భద్రతా బలగాలు నిన్న రాత్రి నుంచి సామాన్య భక్తులకూ అవకాశమిచ్చాయి. 






ప్రాణప్రతిష్ఠ పూర్తైన తర్వాత జరిగే ప్రభాత కాల దర్శనం కావటంతో భక్తులు వేల సంఖ్యలో అయోధ్య రాముడి ఆలయానికి చేరుకున్నారు. అర్థరాత్రి నుంచి ప్రధాన ద్వారం వద్ద వేలాదిగా రామ భక్తులు దర్శనం కోసం నిలబడ్డారు. స్వామివారి దర్శనానికి టికెట్లు లేకపోవటం..ఐదువందల ఏళ్ల తర్వాత రాముడికి గుడి కట్టి భక్తులకు దర్శన అవకాశం కల్పించటంతో తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా ఊహించని స్థాయిలో అయోధ్యకు భక్తులు చేరుకున్నారు. 






వసతి సౌకర్యాలు గదులు ఏ మాత్రం సరిపోకపోగా..ప్రస్తుతం ఉన్న రద్దీ తగ్గాలంటే 40గంటలు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భక్తులు సహకరించాలని రామయ్య దర్శించుకునేందుకు కాస్త సంమయమనం ప్రదర్శించాలని ఆలయ అధికారులు కోరుతున్నారు.