ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల తేదీల్ని కేంద్ర ఎన్నికల సంఘం (EC) ప్రకటించింది. ఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ అధికారికంగా ఈ తేదీల్ని ప్రకటించారు. మిజోరంలో నవంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 7న ఎన్నికలు నిర్వహించనున్నారు. మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్‌లో నవంబర్ 23న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3వ తేదీనే ఫలితాలు వెల్లడించనున్నారు. డిసెంబర్ 5 తో మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. 


పోలింగ్ తేదీలు ఇలా..


మధ్యప్రదేశ్: నవంబర్ 17


రాజస్థాన్‌: నవంబర్ 23


ఛత్తీస్‌గఢ్‌ (రెండు విడతల్లో) : నవంబర్ 7, 17


తెలంగాణ: నవంబర్ 30


మిజోరం: నవంబర్ 7


ఫలితాల ప్రకటన : డిసెంబర్ 3











తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ ఇదే


పోలింగ్‌ తేదీ- 30 నవంబర్ 2023


కౌంటింగ్ తేదీ- 3 డిసెంబర్‌ 2023


తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్:  3 నవంబర్‌ 2023
ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తేదీ-  3 నవంబర్‌ 2023
ఎన్నికల నామినేషన్లకు తుది గడువు -  10 నవంబర్‌ 2023
నామినేషన్ల స్క్రూట్నీ తేదీ-  13 నవంబర్‌ 2023
నామినేషన్ల  ఉపసంహరణకు ఆఖరు తేదీ-  15 నవంబర్‌ 2023