Watch Video: మంగళవారం దేశంలోనే తొలి ఆపిల్ స్టోర్‌ను ఆ సంస్థ సీఈవో టిమ్‌ కుక్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ అరుదైన దృశ్యం ఆయన్ని ఆశ్చర్యపరిచింది. 1984 నాటి ఆపిల్ వింటేజ్ కంప్యూటర్‌తో ఓ అభిమాని ఆయనకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆపిల్ స్టోర్ ఓపెనింగ్ టైంలో ఈ దృశ్యం కనిపించింది. 


భారతదేశంలో ఆపిల్ తొలి రిటైల్ స్టోర్ ఇవాళ (మంగళవారం, 18 ఏప్రిల్‌ 2023) ముంబైలో ప్రారంభమైంది. ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ (Apple CEO Tim Cook), ఉదయం 11 గంటలకు అధికారికంగా ఈ స్టోర్‌ను లాంచ్‌ చేశారు. దీన్ని చూసేందుకు ఆయనతో ఫొటోలు దిగిందుకు చాలా మంది ఆపిల్‌ ఫోన్ యూజర్లు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. 


తనను చూసేందుకు ఫొటోలు తీగేందుకు వస్తున్న అభిమానులతో సరదగా మాట్లాడారు టిమ్‌కుక్. ఇంతలో అక్కడకు ఓ పెద్ద బాక్స్‌లో సందర్శకుడు వచ్చారు. ఆయన చేతిలో ఉన్న పాత కంప్యూటర్‌ను చూసి టిమ్‌కుక్‌ కూడా ఆశ్చర్యపోయారు. వావ్ అంటూ హత్తుకున్నారు. 


ఆపిల్ జర్నీ తెలియజేసేందుకే ఈ వింటేజ్‌ కంప్యూటర్‌ను తీసుకొచ్చినట్టు ఆ యూజర్ చెప్పాడు. 1984 నుంచి ఆపిల్‌ ప్రోడెక్ట్స్‌ తాను వాడుతున్నట్టు వివరించాడు. ఇది 2 మెగా బైట్స్ బ్లాక్ అండ్ వైట్ కంప్యూటర్‌ అని ఇప్పుడు ఆపిల్‌ సంస్థ 4కే, 8కే రెజల్యూషన్‌ డిస్‌ప్లేలు తయారు చేస్తుందన్నారు. 






ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, నాణ్యమైన ఆపిల్‌ ఉత్పత్తులను అమ్మే ఈ స్టోర్‌ను చాలా నిరాడంబరంగా ప్రారంభించారు. మేళతాళాలు, రిబ్బన్ కటింగ్స్‌ లాంటివేమీ పెట్టుకోలేదు. నలుపు రంగ టీ షర్ట్‌ వేసుకుని ఈ కార్యక్రమానికి వచ్చిన టిమ్‌ కుక్‌, సింపుల్‌గా బీకేసీ యాపిల్ స్టోర్‌ గేట్‌ను తెరిచి పట్టుకోవడంతో స్టోర్‌ లాంచ్‌ అయింది. అయితే, మీడియా హడావిడి బాగానే కనిపించింది. యాపిల్‌ సిబ్బంది పచ్చరంగు ఫుల్‌హ్యాండ్‌ టీ షర్ట్స్‌తో కనిపించారు. వందలాది మంది ప్రజలు, ఆపిల్ అభిమానులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ స్టోర్‌లో ఆపిల్‌ ఉత్పత్తుల అమ్మకం నేటి నుంచి ప్రారంభమైంది.


సోమవారం మధ్యాహ్నం ముంబై చేరుకున్న టిమ్‌ కుక్‌, ముకేష్ అంబానీ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశం అయ్యారు. బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌తో కలిసి వడ పావ్ తిన్నారు. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్‌.చంద్రశేఖరన్‌తో సహా కొందరు ప్రముఖ వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖులను కూడా ఆయన కలిశారని సమాచారం.


ఐఫోన్ తయారీ కంపెనీ ఆపిల్‌ రెండో రిటైల్‌ స్టోర్‌ కూడా ఈ నెల 20న (గురువారం) దిల్లీలో ప్రారంభం కానుంది. దిల్లీ సాకేత్ ప్రాంతంలోని హై-ఎండ్ మాల్‌లో ఏర్పాటు చేసిన ఆపిల్‌ స్టోర్‌ తలుపులు టిమ్‌ కుక్‌ అన్‌లాక్ చేస్తారు. ఈ స్టోర్‌ను యాపిల్‌ సాకేత్‌గా (Apple Saket) పిలుస్తున్నారు