ఏపీ లోని గ్రామ పంచాయతీలకు విడుదలైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించందని ఆరోపిస్తూ దీనిపై వెంటనే సీబీఐ విచారణ చేపట్టాలని ఏపీ సర్పంచుల సంఘం, ఏపీ పంచాయతీ ఛాంబర్ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 2019 నుంచి 2023 కాలంలో సుమారు రూ.8629 కోట్లు  నిధులు విడుదల అయ్యాయని వాటిని అన్నింటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిందని వారు ఆరోపిస్తున్నారు.


టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్‌, రామ్మోహన్‌ నాయుడు ఆధ్వర్యంలో ఏపీ పంచాయతీ రాజ్‌ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌, వివిధ పార్టీలకు చెందిన సుమారు 125 మంది సర్పంచులు బుధవారం నాడు ఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ సహాయ మంత్రి కపిల్‌ పాటిల్‌ ను కలిసి వారి వినతులను అందజేశారు.


పంచాయతీరాజ్ వ్యవస్థతో పోటీ పడేందుకే సచివాలయాలను, వాలంటీర్లను ఏర్పాటు చేసి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థను కాలరాసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను ఇతర పథకాలకు వినియోగిస్తున్నట్లు మంత్రికి తెలిపారు.


ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా తప్పుడూ పత్రాలనే సమర్పించి కాగ్‌ ను కేంద్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మంత్రిని కలిసిన అనంతరం బయటకు వచ్చిన ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు.


మంత్రి తమ విజ్ఙప్తి పై సానుకూలంగా స్పందించారు. ఫిర్యాదులోని అంశాలు తీవ్రంగా కనిపిస్తున్నాయని..తప్పనిసరిగా ఉన్నతస్థాయి విచారణ జరిపించి న్యాయం చేస్తామని హామీనిచ్చారని పేర్కొన్నారు.