AP Significant Contributions: బ్రిటీష్ వలస పాలన నుంచి విముక్తి కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం భారత్ నలుమూలలకు చెందిన ప్రజలు ఎంతో శ్రమించారు. రక్తం చిందించిన వారు ఎంతో మంది. అహింసాయుతంగా పోరాటం చేసిన వారు లెక్కకు మిక్కిలే ఉంటారు. భారత స్వతంత్ర పోరాటంలో ఆంధ్రప్రదేశ్ వాసులు కీలక పాత్ర పోషించారు. ప్రముఖ నాయకుల నుంచి సామూహిక ఉద్యమాల వరకు భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో విజయం కోసం చెమటోడ్చారు, రక్తం చిందించారు, జైలుకు కూడా వెళ్లారు. స్వతంత్రోద్యమంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖులు చాలా మందే ఉన్నారు. 


స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర 


స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రసిద్ధ నాయకుల్లో ఆంధ్రకేసరిగా ప్రసిద్ధి చెందిన టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యులు. ఆయన గాంధేయవాది. అహింసాయుత పోరాటం సాగించారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఎంతో మందికి ప్రేరణ కల్పించారు. స్వతంత్ర సంగ్రామంలో పోరాడేలా యువకుల్లో స్ఫూర్తి రగిలించారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన మరో నాయకుడు మొదటి దశ స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించారు. బ్రిటీష్ వారికి వెన్ను చూపకుండా పోరాడారు. ఆయనే అల్లూరి సీతారామ రాజు. బ్రిటీష్ వారి దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. గిరిజన ప్రాంతాల్లో ఆయన చేసిన సాహసోపేతమైన పోరాటం ఇప్పటికీ ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే.


సామూహిక ఉద్యమాలకు సహకారం


బ్రిటీష్ పాలన పునాదులను కదిలించిన ప్రధాన ప్రజా ఉద్యమాల్లో ఆంధ్రప్రదేశ్ చాలా చురుకుగా పాల్గొంది. బ్రిటీష్ సంస్థలు, వస్తువులు, సేవలను బహిష్కరించి సహాయ నిరాకరణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించింది. శాసనోల్లంఘన ఉద్యమం స్వేచ్ఛ కోసం పిలుపును మరింత విస్తృతం చేసింది. కొండా వెంకటప్పయ్య వంటి వ్యక్తులు నిరసనలు, శాసనోల్లంఘన చర్యలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.


వార్తాపత్రికలు, సాహిత్యం


జాతీయవాద ఆలోచనలను వ్యాప్తి చేయడంలో, ప్రజలను చైతన్యపరచంలో పత్రికలు కీలక పాత్ర పోషించాయి. ప్రముఖ తెలుగు వార్తాపత్రిక ఆంధ్ర పత్రిక స్వాతంత్ర్య ఉద్యమానికి బహిరంగంగా మద్దతునిచ్చి బ్రిటీష్ అన్యాయాలపై అవగాహన కల్పించింది ఆంధ్ర పత్రిక. గురజాడ అప్పారావు వంటి సాహితీవేత్తలు బ్రిటీష్ దోపిడీ గురించి ఎన్నో రచనలు చేసి అందరికీ అవగాహన కల్పించారు. 


Also Read: Women Freedom Struggle: స్వాతంత్య్ర పోరాటంలో తెగించి కొట్లాడిన ధీర వనితలు, ఒక్కొక్కరి జీవితం స్ఫూర్తిదాయకం


ఉప్పు సత్యాగ్రహానికి సహకారం


భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఉప్పు సత్యాగ్రహం ఒక కీలకమైన మైలురాయి వంటిది. ఈ ఉప్పు సత్యాగ్రహానికి ఆంధ్రప్రదేశ్ నుంచి బలమైన మద్దతు లభించింది. ఆంధ్ర ప్రాంతం అంతటా ప్రజలు ఉప్పు చట్టాలను ధిక్కరించి, ఉప్పును తయారు చేసి బ్రిటీష్ గుత్తాధిపత్యాన్ని సవాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమం సాధించిన విజయ దేశవ్యాప్తంగా విస్తృత ఉద్యమానికి గణనీయంగా దోహదపడిందని చరిత్రకారులు చెబుతారు.


క్విట్ ఇండియా ఉద్యమం


1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య, ఎన్జీ నిరసనలు, సమ్మెలు, శాసనోల్లంఘన కార్యకలాపాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఉద్యమ ఉత్సాహం రాష్ట్రం అంతటా వ్యాపించి, స్వేచ్ఛను సాధించాలనే ప్రజల సంకల్పాన్ని ప్రదర్శింది.