Anant Radhika Pre Wedding: అనంత్‌ అంబానీ రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక నభూతో నభవిష్యతి అన్నట్టు సాగింది. అంగరంగవైభవంగా సాగుతున్న వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో ఇంటర్‌నెట్‌ హోరెత్తిపోతోంది. వారం రోజుల నుంచి ఇదో ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. చాలా మంది సెలబ్రెటీల డెస్టినేషన్ జామ్‌నగర్‌ అయిపోయింది. 


వేడుకలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా భారతీయ సంప్రదాయ పద్ధతిలో సాగుతున్న సంబరాలు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలను, ఫొటోలను అంతా షేర్ చేస్తున్నారు. మొదటి రోజు. అలాంటి ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మెహందీ ఫంక్షన్ నుంచి ప్రధాన వేడుక వరకు అన్నింటినీ సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. భారతీయ వివాహాలు, అక్కడ చేపట్టే సాంస్కృతిక కార్యక్రమాలన్నీ వివిధ ఆచారాలను కలిగి ఉంటాయి. వాటన్నింటినీ అంబానీ ఫ్యామిలీ పాటించిందనే ప్రశంసలు వినిపిస్తున్నాయి. 


భారీగా విదేశీయులు కొలువుదీరి ఉన్న వేదికపై అచ్చమైన భారతీయ సంప్రదాయపద్దతిలో వివాహం జరగడం అభినందనీయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 






అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌ గుజరాత్‌లోని జామ్ నగర్‌లో మూడు రోజుల పాటు జరిగాయి. ఈవెంట్ చివరి రోజున స్టార్స్ నుంచి అంబానీ కుటుంబ సభ్యుల వరకు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు.  నీతా అంబానీ చేసిన డ్యాన్స్‌ మాత్రం వచ్చిన అతిథులను మెస్మరైజ్ చేసింది. సంప్రదాయం, ఆధ్యాత్మికతకు మేళవిస్తూ సాగిన నృత్యం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. శక్తి, సహనానికి ప్రతిరూపమైన దుర్గాదేవిని స్తుతిస్తూ సాగిన పాటకు నీతా అంబానీ మంత్రముగ్ధులయ్యే ప్రదర్శన ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


అనంత్-రాధిక కోసం తల్లి ఆశీస్సులను కోరుతూ నీతా అంబానీ నృత్య ప్రదర్శన చేశారు. నీతా అంబానీతి నవరాత్రుసు చాలా ప్రత్యేకం. అందుకే  కుమారుడు అనంత్, కోడలు రాధికా మర్చంట్‌ భవిష్యత్ మంచిగా ఉండాలని అమ్మ ఆశీస్సులు కోరుతూ ఈ ప్రక్రియ చేపట్టారు. 






గుజరాత్‌లోని జామ్ నగర్‌లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మూడు రోజుల పాటు జరిగాయి. ఈ ఫంక్షన్‌లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ సహా బాలీవుడ్ తారలందరూ హాజరయ్యారు. మార్క్ జుకర్ బర్గ్, ఇవాంకా ట్రంప్, బిల్ గెస్ట్స్ వంటి అంతర్జాతీయ సెలబ్రెటీలు కూడా పాల్గొన్నారు. గ్లోబల్ పాప్ సింగర్ రిహన్నా కూడా అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.