మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు, హింసాకాండపై సోమవారం (జూలై 24) పార్లమెంట్ ఉభయ సభల్లో పెద్ద దుమారమే రేగింది. దీంతో ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. మణిపూర్ సమస్య గురించి సభల్లో చర్చించడానికి తాము రెడీగా ఉన్నామని అమిత్ షా లోక్ సభలో వెల్లడించారు. ఈ అంశంపై చర్చకు సహకరించాలని ప్రతిపక్షాలను అభ్యర్థిస్తున్నానని అమిత్ షా అన్నారు. ఈ సున్నితమైన అంశం గురించి దేశ ప్రజలకు నిజం తెలియడం చాలా ముఖ్యమని అన్నారు. మొత్తానికి సభ్యుల నినాదాలు, గందరగోళం మధ్య లోక్ సభ మంగళవారం (జూలై 25) ఉదయం 11 గంటలకు వాయిదా పడింది.






మణిపూర్ అంశంపై పార్లమెంటులో దుమారం


పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా సోమవారం రాజ్యసభ, లోక్‌సభ రెండింటిలోనూ ప్రతిపక్ష సభ్యులు మణిపూర్‌పై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ప్రతిపక్షాల నిరసన సమయంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను వర్షాకాల సమావేశాలు ముగిసే దాకా రాజ్యసభ ఛైర్మన్ సస్పెండ్ చేశారు. అంతకుముందు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో మాట్లాడుతూ పార్లమెంటులో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.


మల్లికార్జున ఖర్గే ఏం మాట్లాడారంటే?


ఈ విషయంపై రాజ్యసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ.. తాము కూడా చర్చకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ విషయంలో ప్రధాని తన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు. 140 కోట్ల మందికి చెందిన ప్రతినిధులు సభ లోపల కూర్చుంటే ముందు ప్రధాని స్టేట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.


మణిపూర్‌లో కాస్త అదుపులో అల్లర్లు


మే 3న మణిపూర్‌లో రిజర్వేషన్‌ డిమాండ్‌పై కుకీ, మైతేయి వర్గాల మధ్య కుల హింస చెలరేగిన సంగతి చెలరేగిన సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటి వరకు 160 మందికి పైగా మరణించారు. గత వారం మణిపూర్‌కు చెందిన మహిళల నగ్న ఊరేగింపు వీడియో వైరల్‌గా మారింది. ఆ తర్వాత దేశమంతా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.


మణిపూర్‌లో కాస్త అదుపులో అల్లర్లు


మే 3న మణిపూర్‌లో రిజర్వేషన్‌ డిమాండ్‌పై కుకీ, మైతేయి వర్గాల మధ్య కుల హింస చెలరేగిన సంగతి చెలరేగిన సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటి వరకు 160 మందికి పైగా మరణించారు. గత వారం మణిపూర్‌కు చెందిన మహిళల నగ్న ఊరేగింపు వీడియో వైరల్‌గా మారింది. ఆ తర్వాత దేశమంతా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.


అమిత్ షాను కలిసిన బండి సంజయ్


బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ సోమవారం (జూలై 24) ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బండి సంజయ్ కుమార్ కేంద్ర హోం మంత్రితో మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రిని కలిసిన అనంతరం బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ విజయం సాధించేందుకు మంచి పని చేయాలని అమిత్ షా అన్నారు. తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి మంచి ఫలితాలు వచ్చేలా బీజేపీ వ్యూహం రచిస్తూ ఉంది.