Amarnath Flash Floods: అమర్‌నాథ్ ఆలయం సమీపంలో అకస్మాత్తుగా సంభవించిన వరదల్లో గల్లంతైన వారి కోసం ఆర్మీ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. శనివారం అర్ధరాత్రి తర్వాత కూడా గాలింపు చర్యలు చేపట్టారు సైనికులు.
ఈ గాలింపులో తాజాగా ఎలాంటి మృతదేహాలు లభ్యం కాలేదని ఆర్మీ స్పష్టం చేసింది. మరోవైపు ఈ ఆపరేషన్‌లో పర్వత గస్తీ బృందాలు, డ్రోన్లు, జాగిలాలు, అత్యాధునిక పరికరాలను వినియోగిస్తున్నారు.
ఇదీ జరిగింది
ప్రతికూల వాతావరణం మధ్య సాగే పవిత్ర అమర్‌నాథ్ యాత్రలో తీవ్ర విషాదం నెలకొంది. స్వల్ప వ్యవధిలో కురిసిన భారీ వర్షాల కారణంగా గుహ వద్ద భారీ వరద ముంచెత్తింది. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఊహించని రీతిలో కొండలపై నుంచి ఒక్కసారిగా వరద నీరు దూసుకువచ్చింది.
గుహకు సమీపంలోని యాత్రికుల టెంట్లను చుట్టుముట్టింది. అనేక టెంట్లు కొట్టుకుపోయాయి. ఊహించని పరిణామానికి భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 16 మంది చనిపోయినట్లు ఆర్మీ ప్రకటించింది. గల్లంతైన వారి కోసం సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ కలిసి పనిచేస్తున్నాయి. హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 18,257 మందికి కరోనా- ఎంత మంది మృతి చెందారంటే?
Also Read: Telescope Origin : టెలిస్కోపుల తయారు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది?