= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
మెడికల్ కాలేజీ వద్ద కూలిన విమానం, 20 మందికి పైగా మెడికోలు సైతం మృతి అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే AI171 Boeing 787 Dreamliner ఇండిగో విమానం క్రాష్ అయింది. అయితే జేబీ మెడికల్ కాలేజీ బిల్డింగ్ మీద కూలడంతో 20 మందికి పైగా మెడికోలు మృతిచెందారని అధికారులు చెబుతున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Air India Plane Crash:సేవలు పునరుద్ధరించిన అహ్మదాబాద్ విమానాశ్రయం AI171 Boeing 787 Dreamliner విమాన ప్రమాదం కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమాన సేవల్ని పునురుద్ధరించారు. అహ్మదాబాద్ లోని విమానాశ్రయం సేవలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికరం: Pawan Kalyan ’అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 242 మందితో లండన్ బయలుదేరిన విమానం – టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడాన్ని ఊహించలేకున్నాము. వైద్య కళాశాల వసతి భవనాలపై కూలడంతో ఒక మహా విషాదంగా మిగిలింది. ఈ దుర్ఘటనలో మృతులకు దేశం బాసటగా ఉండాల్సిన సమయం ఇది’ అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Air India Plane Crash: దురదృష్టకర సంఘటన, కేంద్రం బాధిత కుటుంబాలను ఆదుకోవాలి: రేవంత్ రెడ్డి అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకర సంఘటన, చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కేటీఆర్ దిగ్భ్రాంతి అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణీకుల, సిబ్బంది కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ దురదృష్టకర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వైద్య విద్యార్థుల కుటుంబాలకు నా సంతాపం. ఈ విమానం మెడికల్ కాలేజీ హాస్టల్లోకి కూలిపోవడం చాలా హృదయ విదారకంగా ఉంది. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని’ కేటీఆర్ ఆకాంక్షించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసిన అహ్మదాబాద్ పోలీసులు అహ్మదాబాద్ పోలీసులు అత్యవసర నంబర్‌ను విడుదల చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన పోలీసు అత్యవసర సేవలు మరియు సమాచారం కోసం అహ్మదాబాద్ నగర పోలీసులు 07925620359 అత్యవసర నంబర్‌ను విడుదల చేశారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Air India Plane Crash: టేకాఫ్ అయిన వెంటనే ‘మేడే’ అలర్ట్ ఇచ్చిన సిబ్బంది విమానం ప్రధాన పైలట్ సుమిత్ సభర్వాల్‌కు 8200 గంటల ఫ్లైయింగ్ అవర్స్ అనుభవం ఉంది. ఆ విమానం కోపైలట్‌కు 1100 గంటల ఫ్లైయింగ్ అవర్స్ అనుభవం ఉందని డీజీసీఏ తెలిపింది. అహ్మదాబాద్ విమానాశ్రయంలోని రన్‌వే 23 నుంచి మధ్యాహ్నం 1.39కి విమానం టేకాఫ్ అయింది. కొద్దిసేపటికే ఏటీసీకి విమాన సిబ్బంది ‘మేడే’ కాల్ చేసింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
గుజరాత్ ముఖ్యమంత్రితో మాట్లాడిన హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్‌లోని ఎయిర్ ఇండియా విమాన ప్రమాద స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రితో మాట్లాడారు. కేంద్రం సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Air India Plane Crash: అహ్మదాబాద్ కు బయలుదేరిన అమిత్ షా అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలగా.. సహాయక చర్యలు చేపట్టారు. లండన్ వెళ్తున్న విమానం టేకాఫ్ అయ్యాక జనావాసాలపై కూలిపోయింది. సహాయక చర్యలకు ఆదేశించిన కేంద్ర మంత్రి అమిత్ షా అహ్మదాబాద్ కు బయలుదేరారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Air India Plane Crash: విమాన ప్రమాదంపై సమాచారాన్ని సేకరిస్తున్నాం : ఎయిర్ ఇండియా Air India Plane Crash: అహ్మాదాబాద్ నుంచి లండన్ గాట్విక్‌కు వెళ్తున్న ఆ విమానం క్రాష్ అయిందని తన ట్వీట్లో ఎయిర్ ఇండియా కంపెనీ వెల్లడించింది. గురువారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా కూలిపోవడంతో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నాం, వీలైనంత త్వరలో ఆ విషయాలను వెల్లడించనున్నట్లు ఎయిర్ ఇండియా చెప్పింది. 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసు కంట్రోల్ రూమ్ పేర్కొన్నది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Air India Plane Crash: సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేత సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. "అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ వెళ్లే విమానం AI 171 ఈ ఉదయం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ పోర్ట్ వెలుపల కూలిపోయింది. అందువల్ల అహ్మదాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్తుతం సేవలు అందించడం లేదు. తాత్కాలికంగా విమానాశ్రయం నుంచి సేవలు నిలిపివేశారు. తరువాతి నోటీసు వచ్చే వరకు అన్ని విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఓ అధికారి తెలిపారు. ప్రయాణీకులు తమ తమ విమానయాన సంస్థలను సంప్రదించి జర్నీని ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Air India Plane Crash: అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ దశ్యాలు - వీడియో Ahmedabad Flight Crash : అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం అత్యంత విషాదంగా జరిగింది. ఇలా బయలుదేరగానే నాలుగైదు నిమిషాల్లోనే అలా కుప్పకూలిపోయింది. తెగిన గాలి పటంలా.. అలా కిందకు వెళ్లిపోతున్న దశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ప్రధాని మోదీ ఫోన్, విమాన ప్రమాదంపై ఆరా అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడారు. ఎయిర్ ఇండియా విమానం క్రాష్ ప్రమాదంపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో సహాయ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి తాను అహ్మదాబాద్‌కు వెళ్తున్నానని రామ్మోహన్ నాయుడు ప్రధానమంత్రికి తెలిపారు. అవసరమైన అన్ని సహాయాలను వెంటనే అందించాలని, పరిస్థితిపై క్రమం తప్పకుండా సమాచారం అందించాలని ప్రధాని మోదీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును ఆదేశించారు. అన్ని సంబంధిత సంస్థలు అప్రమత్తంగా ఉన్నాయి. సమన్వయంతో సహాయక చర్యలు, వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసినట్లు రామ్మోహన్ నాయుడు ప్రధాని మోదీకి తెలిపారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో దట్టంగా పొగ అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలగా, అందులో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో దట్టంగా పొగ కమ్ముకుంది. 12 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కేంద్రం బలగాలను పంపుతామని చెప్పిన హోం మంత్రి అమిత్ షా అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రితో మాట్లాడి కేంద్ర సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
టేకాఫ్ అయిన 5 నిమిషాలకే ప్రమాదం అహ్మదాబాద్ నుండి లండన్ (గాట్విక్) విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన B787 డ్రీమ్‌లైనర్ విమానం గురువారం మధ్యాహ్నం 1:38 గంటలకు టేకాఫ్ అయిన వెంటనే ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన 5 నిమిషాల తర్వాత నివాస ప్రాంతంలో (మేఘని నగర్) కూలిపోయింది. డైరెక్టరేట్ ఆఫ్ ఎయిర్‌వర్తినెస్ (DAW), అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆఫ్ ఎయిర్‌వర్తినెస్ (ADAW), ఒక ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ (FOI) ఇప్పటికే వేరే పని కోసం అహ్మదాబాద్‌లో ఉన్నారని DGCA తెలిపింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న AIRINDIA Boeing 787 డ్రీమ్ లైనర్ అహ్మదాబాద్: గుజరాత్ లోని అహ్మదాబాద్‌లోని మేఘాని నగర్లో ఓ విమానం క్రాష్ అయింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న AIRINDIA Boeing 787 డ్రీమ్ లైనర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. టేకాఫ్ అయిన వెంటనే నివాస సముదాయాలపై ఎయిరిండియా ఫ్లైట్ కూలిపోయినట్లు తెలుస్తోంది. దాంతో ఆ మార్గలో రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేస్తూ అన్ని రోడ్లను మూసివేశారు.