Ahmedabad Plane Crash Report: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాద సమయంలో కాక్‌పీట్‌లో జరిగిన డిస్కషన్ నుంచి ఎయిర్ ఇండియా తప్పిదాల వలకు చాలా అంశాలను రిపోర్టులో ప్రస్తావించారు. ఈ నివేదికపై ఎయిర్ ఇండియా, బోయింగ్ రెండూ స్పందించాయి. 

ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (AAIB) నివేదికపై ఎయిర్ ఇండియా తొలిసారి స్పందించింది. దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని ఏవియేషన్ కంపెనీ తెలిపింది. ఎయిర్ ఇండియా శనివారం Xలో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. నివేదికపై తన వాదన తెలియజేసింది.  

AAIB వేడుదల చేసిన ప్రాథమిక నివేదికపై ఎయిర్ ఇండియా చేసిన పోస్టులో ఏముంది అంటే "AI171 ప్రమాదంలో ప్రభావితమైన కుటుంబాలకు, ఇతరులకు ఎయిర్ ఇండియా అండగా నిలుస్తుంది. జరిగిన నష్టానికి మేము చాలా చింతిస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో వారికి సహాయం చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాము. ఈరోజు, జూలై 12, 2025న AAIB విడుదల చేసిన ప్రాథమిక నివేదిక గురించి సమాచారం అందింది. మేము AAIB, ఇతర దర్యాప్తు సంస్థలతో పూర్తిగా సహకరిస్తాము.

ప్రాథమిక నివేదికపై కామెంట్ చేయడానికి ఎయిర్ ఇండియా నిరాకరణ AAIB ప్రాథమిక నివేదికపై వ్యాఖ్యానించడానికి విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నిరాకరించింది. ఇదే విషయాన్ని ఎక్స్‌ పెట్టిన పోస్టులో వెల్లడించింది. "దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. అందుకే ప్రస్తుత వెలుగులోకి వచ్చిన విషయాలపై మేము వ్యాఖ్యానించలేం. దర్యాప్తునకు కావాల్సిన సమాచారాన్ని మేము AAIBకి పంపుతున్నాము."

మరోవైపు బోయింగ్‌ సంస్థ కూడా AAIB ప్రాథమిక నివేదికపై స్పందించింది. బోయింగ్‌ సీఈఓ కెల్లీ ఓర్ట్‌బర్గ్‌ నివేదిక బహిర్గతం అయిన తర్వాత స్పందించారు. "బాధిత కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపం. పూర్తి మద్దతు తెలిపేందుకు ఎయిరిండియా ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖర్‌తో చర్చించాం. ప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తునకు పూర్తిగా మద్దతు ఇస్తాం. దీనికి బోయింగ్‌ సిబ్బంది సిద్ధంగా ఉంది."