Aditya-L1 Solar Mission: 


నిప్పులు కక్కుతూ..నింగిలోకి.


దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆదిత్య L1 మిషన్‌ని (Aditya-L1 Launch) లాంఛ్ చేసింది ఇస్రో. నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది ఈ రాకెట్. సరిగ్గా 11.50 నిముషాలకు రాకెట్ లాంఛ్ అయింది. రెండు దశలు విజయవంతం అయినట్టు ఇస్రో ప్రకటించింది. ఆ తరవాత అన్ని దశలూ దాటుకుని వెళ్లింది ఆదిత్య L1. చివరకు స్పేస్‌క్రాఫ్ట్‌ నుంచి ఉపగ్రహం విజయవంతంగా విడిపోయినట్టు వెల్లడించింది. ఆదిత్య L1 తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని తెలిపింది. 






మొత్తం ప్రయోగ సమయం 53 నిముషాల వరకూ ఉండనుంది. ఆదిత్య L1ని క్రమంగా లగ్రాంజ్ పాయింట్‌లోకి ప్రవేశపెట్టనుంది ఇస్రో. మూడు దశలూ విజయవంతం అయినట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రస్తుతం కీలకమైన నాలుగో దశపై ఉత్కంఠ కొనసాగుతోంది.  లగ్రాంజియన్ పాయింట్‌కి చేరుకున్న తరవాత Visible Emission Line Coronagraph (VELC) సాయంతో అక్కడి నుంచి ఫొటోలు పంపనుంది ఆదిత్య L1. రోజుకి 1,440 ఫొటోలు పంపుతుందని ఇస్రో ప్రకటించింది. ఈ ఫొటోల ద్వారా సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు వీలవుతుంది. ఆదిత్య L1లో అతి పెద్ద పే లోడ్ VELC. ఈ మిషన్ మొత్తంలో ఇదే అత్యంత కీలకం. Indian Institute of Astrophysics ఇస్రోతో కలిసి ఈ పేలోడ్‌ని తయారు చేసింది.