Aditya L1 Launch LIVE: నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్-1- మూడు దశలు విజయవంతం
Aditya L1 Mission Launch LIVE Updates: చంద్రుడిపై చంద్రయాన్-3 విజయం తర్వాత భారత్ సూర్యుడి వైపు దృష్టి పెట్టింది. ఇస్రో ఈ రోజు (సెప్టెంబర్ 3) ఆదిత్య ఎల్ 02 ను ప్రయోగించబోతోంది.
ABP Desam Last Updated: 02 Sep 2023 12:59 PM
Background
Aditya L1 Mission Launch LIVE Updates: 10 రోజుల క్రితం ఆగస్టు 23న అంతరిక్షంలో భారత్ తనదైన ముద్ర వేసింది. చంద్రుడి దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ -3 దిగ్విజయంగా పని...More
Aditya L1 Mission Launch LIVE Updates: 10 రోజుల క్రితం ఆగస్టు 23న అంతరిక్షంలో భారత్ తనదైన ముద్ర వేసింది. చంద్రుడి దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ -3 దిగ్విజయంగా పని చేస్తూ ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలిచంది. చంద్రయాన్ -3 ప్రయోగించిన సుమారు రెండు నెలల తరువాత ఇస్రో మరొక చారిత్రాత్మకమైన మిషన్ అంతరిక్షంలోకి పంపించేందుకు సిద్ధమైంది. అదే ఆదిత్య ఎల్ 1. ఈ మిషన్ సూర్యుడికి సంబంధించినది. మరికొద్ది గంటల్లోనే ఇది తన ప్రయాణాన్ని ప్రారంభించబోతోంది.చంద్రయాన్ -3 చంద్రుడిపై దిగిన ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ప్రపంచమే ఆశ్చర్యపోయే విషయాలు తెలుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే అంతరిక్ష శాస్త్రంలో భారతదేశం మరో అసాధారణ అడుగు వేయడానికి సిద్ధమైంది. ఇప్పుడు సూర్యుడిపై తన ఫోకస్ మళ్లించింది ఇస్రో. ఈ తరహా అంతరిక్ష ప్రయోగం చేపట్టడం ఇదే తొలిసారి. ఇది సూర్యుని పరిశోధనకు సంబంధించినది.సూర్యుడి ఎగువ వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి ఆదిత్య ఎల్ 1 మిషన్ పని. ఈ మిషన్ ద్వారా సూర్యుడి వెలుపలి పొర గురించి సమాచారం తెలుసుకోవచ్చు. ఆదిత్య ఎల్1 అనేది ఒక ఉపగ్రహం. వీటిని 15 లక్షల కిలోమీటర్ల దూరానికి పంపించే ఏర్పాటు చేశారు. ఈ ఉపగ్రహాన్ని ఎల్ 1 అంటే లాగ్రాంజ్ పాయింట్ 1లో అమర్చాల్సి ఉంటుంది. గురుత్వాకర్షణ లేని ప్రాంతాన్ని 'లాగ్రాంజ్ పాయింట్' అంటారు. ఈ ఎల్ 1 బిందువు వద్ద ఆదిత్య ఎల్ 1 సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యుడు ఈ ఎల్ 1 పాయింట్ నుంచి ఇప్పుు వెళ్లే ఆదిత్య ఉపగ్రహంపై ఎలాంటి ప్రభావం చూపదు.శనివారం ఉదయం 11.50 గంటలకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో తన తొలి సోలార్ మిషన్ ప్రయోగించనుంది. కక్ష్యలో ఉపగ్రహం ప్రవేశపెట్టే ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి.శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పంపించనున్న ఆదిత్య ఎల్ - 1 ప్రయోగాన్ని పురస్కరించుకొని ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో ఇస్రో డైరెక్టర్లు అమిత్ కుమార్, డాక్టర్ మోహన్లు ఆదిత్య ఎల్ - 1 ఉపగ్రహ నమూనాతో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదిత్య ఎల్- 1 నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిత్య ఎల్ 1 సక్సెస్ కావాలని శ్రీవారిని ప్రార్థించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆదిత్య ఎల్-1 నమూనాకు వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఇస్రో డైరెక్టర్లను ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి, శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ ఆదిత్య ఎల్ - 1 శాటిలైట్‌ను భూమికి సూర్యుడికి మధ్య ఉన్న లాంగ్రేజ్ 1 పాయింట్ (ఎల్ - 1) వద్ద ఉంచి అక్కడి నుంచి సూర్యుడిపై పరిశోధన చేయనున్నారు. ఎల్ - 1 పాయింట్ వద్ద ఆదిత్య శాటిలైట్ ను మోహరించడం ద్వారా నిరంతరాయంగా శాటిలైట్ సూర్యుడిపై పరిశోధన చేయనుంది. చంద్ర, సూర్య గ్రహణాల సమయంలో కూడా నిరంతరంగా సూర్యుడిపై పరిశోధనలు చేయడానికి వీలుపడుతుంది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో లాంగ్రేజ్ పాయింట్ - 1 ఉంటుంది. ఏడు పేలోడ్స్ ద్వారా పరిశోధనలుఆదిత్య ఎల్-1 ఏడు పేలోడ్స్‌ను తీసుకెళ్తోంది. సూర్యుడి నుంచి వచ్చే సౌర తుపానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణ పరిస్థితులపై రీసెర్చ్ చేయనుంది. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుడి బయటి పొర (కరోనా)పై పరిశోధన చేయడంలో ఈ పేలోడ్స్ ఉపయోగపడనున్నాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA), పుణె ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ మిషన్ కోసం పేలోడ్స్‌ను తయారు చేశాయి.175 రోజుల ప్రయాణం..భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్య వలయం లాంగ్రేజియన్ పాయింట్ -1 (ఎల్1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. భూమి నుంచి లాంగ్రేజియన్ పాయింట్‌కి చేరుకోవడానికి ఆదిత్య ఉపగ్రహానికి 175 రోజులు పడుతుంది. లాంగ్రేజియన్ 1 పాయింట్‌లో ఆదిత్య ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టడం వల్ల గ్రహణాల వంటివి పరిశోధనలకు అడ్డంకిగా మారవు.మూడు దశల్లో ప్రయోగం మొదటి దశలో పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం. పీఎస్ ఎల్ వీ నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. దీనిని భూమి దిగువ కక్ష్యకు తరలిస్తారు. రెండో దశలో భూమి చుట్టూ ఆదిత్య ఎల్-1 కక్ష్యను పెంచి ఉపగ్రహాన్ని భూకక్ష్య నుంచి బయటకు తీసుకురానున్నారు. మూడవ దశ సూర్యయాన్ ను భూమి గురుత్వాకర్షణ నుంచి బయటకు తీసుకురావడం, ఆ తర్వాత చివరి స్టాప్ అంటే ఎల్1లో ఉపగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు.ఆదిత్య ఎల్ 1 భూమిని విడిచిపెట్టి లాగ్రాంజ్ పాయింట్ కు చేరుకోవాలి. ఈ ప్రక్రియకు 125 రోజులు అంటే సుమారు 4 నెలలు పడుతుంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ప్రయోగం విజయవంతం
స్పేస్‌క్రాఫ్ట్ నుంచి ఉపగ్రహం విజయవంతంగా విడిపోయినట్టు ఇస్రో ప్రకటించింది. ఆదిత్య L1 ప్రయాణం మొదలైందని వెల్లడించింది.