Ropeway From Sonprayag To Kedarnath | అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (AEL), అదానీ గ్రూప్ లోని ప్రధాన సంస్థ కీలకమైన కాంట్రాక్ట్ దక్కించుకుంది. అత్యంత పవిత్ర యాత్రా స్థలాలలో ఒకటైన కేదర్‌నాథ్‌కు వెళ్లేందుకు వీలుగా సోన్‌ప్రయాగ్ నుండి కేదర్‌నాథ్‌ను కలిపే రోప్‌వే నిర్మాణ, నిర్వహణ కాంట్రాక్ట్ పొందింది. కంపెనీ చరిత్రలో ఇది ఒక మైలురాయిగా చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు ఫూర్తయితే భక్తులు కేదార్‌నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రానికి రోప్‌వేలో కేబుల్స్ ద్వారా చేరుకోవచ్చు.

Continues below advertisement

ఒక మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్

రూ. 4,081 కోట్ల విలువైన రోప్‌వే ఈ ప్రాజెక్ట్ లో AEL ప్రవేశానికి నాంది పలుకుతుంది. 12.9 కిలోమీటర్ల మేర చేసే ఈ రోప్‌వే ప్రాజెక్టు రుద్రప్రయాగ్ జిల్లాలోని సోన్‌ప్రయాగ్, కేదార్‌నాథ్ మధ్య ప్రయాణ సమయాన్ని 8, 9 గంటల కష్టతరమైన నడకను కేవలం 36 నిమిషాలకు తగ్గిస్తుంది. కేదార్‌నాథ్ క్షేత్రాన్ని ఏడాదిలో 6 నెలలు మాత్రమే దర్శించుకునే వీలుంటుంది. రోప్‌వే పూర్తయిన తర్వాత ఇది గంటకు 1,800 మంది ప్రయాణికులను 2 వైపులా తీసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రతి ఏడాది కేదార్‌నాథ్‌ను సందర్శించే యాత్రికులకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని అదానీ కంపెనీ వెల్లడించింది.

ఈ రోప్‌వే ప్రాజెక్టు ప్రభుత్వ నేషనల్ రోప్‌వేస్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ – పర్వతమాల యోజనలో ఓ భాగం. ఇది AEL రోడ్లు, మెట్రో, రైల్, వాటర్ (RMRW) విభాగం ద్వారా అమలు చేస్తుంది. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (NHLML)తో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) ప్రాతిపదికన ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు. 

Continues below advertisement

సమయం, పరిధి

సోన్‌ప్రయాగ్ నుంచి కేదార్‌నాథ్ చేరుకోవడానికి నిర్మించే రోప్ వే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడానికి ఆరు సంవత్సరాలు పట్టవచ్చు. అనంతరం AEL 29 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తుంది. ఈ రోప్‌వే కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఇది ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని, ఉత్తరాఖండ్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. తద్వారా స్థానికుల స్థితిగతులు కాస్త మెరుగయ్యే అవకాశాలున్నాయి. ప్రతి ఏడాది దాదాపు 20 లక్షల మంది భక్తులు కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు. 

అదానీ గ్రూప్ నిబద్ధత

“కేదార్‌నాథ్ రోప్‌వే ఒక ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ఇది భక్తితో కూడిన ఆధునిక మౌలిక సదుపాయాల మధ్య వారధి” అని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. ఈ కేదార్‌నాథ్ యాత్రను సురక్షితంగా, వేగంగా చేరుకోవడానికి కేబుల్ ద్వారా భక్తులు చేరుకోవచ్చు. ఈ రోప్ వే ప్రాజెక్టు పూర్తయితే మేం లక్షలాది మంది నమ్మకాన్ని నిలబెట్టుకున్నట్లే. అదే సమయంలో NHLML, ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో మా భాగస్వామ్యం ద్వారా ఉత్తరాఖండ్ ప్రజలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ దేశానికి సేవ చేయడమే కాకుండా, అక్కడి ప్రజలను అభివృద్ధి చేసే మౌలిక సదుపాయాలను కల్పించాలనే మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది” అన్నారు.

రోప్‌వే భవిష్యత్తులో యాత్రా మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లకు ఒక నమూనాగా పనిచేస్తుందని  పరిశీలకులు భావిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలయికతో చేపట్టే ఈ ప్రాజెక్ట్ కొండలు, మారుమూల ప్రాంతాలలో కనెక్టివిటీని మెరుగుపరచాలనే ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఉంది.