Income Tax Returns Filing Date Extended | 2025-26 సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు (ITR 2025) దాఖలు చేయడానికి గడువు తేదీని మొదట జూలై 31, 2025న నిర్ణయించగా, దానిని సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ ITRలను దాఖలు చేయడానికి గడువు తేదీని సెప్టెంబర్ 15 నుండి సెప్టెంబర్ 16, 2025 వరకు పొడిగించాలని నిర్ణయించింది. యుటిలిటీలలో మార్పులను ప్రారంభించడానికి, ఈ-ఫైలింగ్ పోర్టల్ 2025 సెప్టెంబర్ 16న ఉదయం 12:00 నుండి ఉదయం 02:30 వరకు మెయింటనెన్స్ మోడ్‌లో ఉంటుందని, ఆ సమయంలో ఐటీఆర్ దాఖలు చేయడం వీలుకాదని స్పష్టం చేసింది.
మరోసారి గడువు పెంచిన సీబీడీటీ
ఆర్థిక సంవత్సరం FY24-25 (AY25-26) ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేందుకు చివరి రోజు నేడే. సెప్టెంబర్ 15తో ఐటీఆర్ ఫైలింగ్ తుది గడువు ముగియగా.. తాజాగా మరోసారి ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగించారు. గత రెండు మూడు రోజులుగాIncome Tax portal మొరాయిస్తోంది. చివరిరోజు కావడంతో సెప్టెంబర్ 15న పెండింగ్ ఉన్న అందరూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో సర్వర్ లోడ్ పెరిగి టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది. దాంతో కేంద్రం మరికొన్ని రోజులు గడువు పెంచుతుందని సోమవారం అర్ధరాత్రి వరకు ట్యాక్స్ ప్లేయర్లు ఎదురుచూశారు. అయితే సెప్టెంబర్ 16ను ఐటీఆర్ దాఖలుకు తుది గడువుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) నిర్ణయించింది. సోమవారం రాత్రి ఈ విషయాన్ని తమ ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది.
నేటితో ముగియనున్న ఐటీఆర్ తుది గడువు
పన్ను చెల్లింపుదారులు (Income Tax Payers) సెప్టెంబర్ 16న కనుక ఐటీఆర్ దాఖలు చేయకపోతే కనుక జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు రూ.1000 ఫైన్ కట్టాలి. రూ.5 లక్షలకు మించి ఆదాయం ఉన్న వారు రూ.5000 వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో జరిమానాతో పాటు జైలుశిక్ష పడే అవకాశాలున్నాయి. అందుకే ఇన్‌కం ట్యాక్స్ వెబ్‌సైట్‌లో మీకు సంబంధించిన కరెక్ట్ వివరాలు నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. మంగళవారం రాత్రిలోగా ఐటీఆర్ ఫైలింగ్ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది.
ట్యాక్స్ పేయర్లు ఫారం 16, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇన్వెస్టిమెంట్ ప్రూఫ్స్, హోమ్ లోన్ వడ్డీ సర్టిఫికేట్, ఫారం 26AS లాంటివి మీ వద్ద రెడీగా ఉంచుకుని ఐటీఆర్ ఫైల్ చేయాలని సూచిస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు డాక్యుమెంట్స్, వివరాలు నమోదు చేయకూడదు. దాని వల్ల మీ ఐటీఆర్ ఫైలింగ్ ను క్యాన్సల్ చేసే అవకాశం ఉంది. కొన్ని సందర్బాలలో భారీ జరిమానా, ఎగవేసిన పన్ను మీద భారీ వడ్డీని వసూలు చేస్తారు.