ఏబీపీ నెట్‌వర్క్ సీఈవో అవినాష్ పాండే మరోసారి న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ (ఎన్‌బీడీఏ) కు అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. దీంతో మేనేజ్‌మెంట్‌ను మార్చడం లేదని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. మాతృభూమి ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ కంపెనీ లిమిటెడ్‌ మేనేజింగ్ డైరెక్టర్ ఎంవీ శ్రేయామ్స్ కుమార్ మరోసారి వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నిక అయ్యారు. అలాగే న్యూస్ 24 బ్రాడ్‌కాస్ట్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కమ్ చైర్ పర్సన్ అనురాధ ప్రసాద్ శుక్లా ఎన్‌బీడీఏ గౌరవ ట్రెజరర్ గా కొనసాగనున్నారు. వీరు ఈ పదవుల్లో ఏడాది పాటు ఉండనున్నారు. ఎలక్షన్ ప్రక్రియ అనంతరం మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బ్రాడ్‌కాస్టింగ్ సెక్రటరీ అపూర్వ చంద్రతో కలిసి ఎంపికైన వారితో లంచ్ కార్యక్రమం జరిగింది.


గతంలో వైస్ ప్రెసిడెంట్


గతంలో NBDA వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన అవినాష్ పాండే, గత ఏడాది సెప్టెంబరు 16న జరిగిన NBDA నియామకాల బోర్డు సమావేశంలో అధ్యక్షుడిగా పదోన్నతి పొందారు. తాజాగా ఆయన్నే మళ్లీ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. 


2005 నుంచి ఏబీపీ గ్రూప్ లో అవినాష్ పాండే


ఏబీపీ గ్రూప్ లో 2005లో చేరిన అవినాష్ పాండే అప్పటి నుంచి వివిధ హోదాల్లో పని చేస్తూ వచ్చారు. అవినాష్ పాండే జనవరి 2019లో ఏబీపీ నెట్‌వర్క్‌కి CEO అయ్యారు. మీడియా రంగంలో 26 సంవత్సరాల అనుభవం ఉన్న ఆయన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్, టీవీ టుడే గ్రూప్ లో పనిచేశారు. ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (IAA) ఇండియన్ చాప్టర్ బోర్డులో అవినాష్ పాండే కూడా ఉన్నారు.