Steps to Link Aadhaar on IRCTC :  భారతీయ రైల్వే శాఖలో తత్కాల్ టికెట్స్ అనేవి హాట్​ కేకుల్లాంటివి. ఇలా బుకింగ్ ఓపెన్ అవ్వగానే అలా టికెట్స్ అమ్ముడుపోతాయి. దీనిలో అక్రమ బుకింగ్​లు ఎక్కువగా ఉన్నాయని గుర్తించి.. సామాన్య ప్రయాణికులకు టికెట్లు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో IRCTC ఓ కొత్త నిబంధనను తెరపైకి తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ నిబంధనకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు.. IRCTCలో ఆధార్​ను ఏ విధంగా లింక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Continues below advertisement

నిబంధన ఇదే.. 

తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే IRCTCలో కచ్చితంగా ఆధార్​ ఓటీపీతో కూడిన ధృవీకరణ చేయాలని నిబంధనలు ఇచ్చింది. దీని ద్వారా భారతీయ రైల్వేల్లో బల్క్ టికెట్లు, అక్రమబుకింగ్​లు తగ్గుతాయని భావిస్తుంది. ఈ నిబంధనతో సామాన్యులకు కూడా తత్కాల్ టికెట్లు దొరుకుతాయని చెప్తున్నారు. ఈ ప్రాసెస్ జూలై 1, 2025వ తారీఖు నుంచి అమలు కానుంది. 

అర్హులు కారు.. 

మీ IRCTC అకౌంట్ ఆధార్​తో లింక్ కాకుంటే మీరు తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవడానికి అర్హులు కారు. కాబట్టి మీరు తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే కచ్చితంగా వైరిఫైడ్ యూజర్ అవ్వాల్సిందే. IRCTC వెబ్​సైట్​లో లేదా IRCTC యాప్​లో మీరు కచ్చితంగా యూజర్​ అవ్వాలి. మీ మొబైల్ నంబర్​ కూడా ఆధార్​కి లింకై ఉండాలి. అప్పుడే మీరు ఆధార్​ ఓటీపీని టైమ్​కి పొందగలుగుతారు. 

Continues below advertisement

IRCTCని ఆధార్​తో ఎలా లింక్ చేయాలంటే.. 

ఆధార్​ని IRCTCలో లింక్ చేయాలంటే irctc.in వెబ్​సైట్​లోకి వెళ్లాలి. లేదా IRCTC వెబ్​సైట్ అని కొడితే డైరక్ట్​ వెబ్​సైట్ ఓపెన్ అవుతుంది. మీరు యూజర్ డిటైల్స్​తో లాగిన్ అవ్వాలి. అనంతరం My Accountని సెలక్ట్ చేయాలి. అక్కడ Link Aadhaarని క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్, పూర్తి పేరు, పుట్టిన తేది వంటి వివరాలు అన్నీ ఇచ్చి.. OTP కోసం Submit చేయాలి. ఆధార్​తో లింక్ అయిన మొబైల్ నెంబర్​కి OTP వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే ఆధార్​ IRCTCతో లింక్​ అయిపోయినట్టే. 

పాన్ కార్డ్​తో కూడా

మీరు పొరపాటు పేరు, పుట్టిన తేది వంటివి తప్పుగా ఇచ్చినా ఎడిట్ ఆప్షన్​తో సెట్ చేసుకోవచ్చు. అయితే ఆధార్​లో ఉన్న డిటైల్స్ మాత్రమే ఇవ్వాలని గుర్తించుకోవాలి. పాన్ కార్డ్​తో కూడా దీనిని చేయవచ్చు. ఆధార్​ లింక్​ కోసం ఓపెన్ చేసిన పేజ్​లోనే పైన పాన్​ కార్డ్ లింక్​ కూడా ఉంటుంది. ఇదే ప్రాసెస్​లో అన్ని డిటైల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 

అతి పెద్ద మార్పు ఇదే

మరో అతిపెద్ద మార్పు ఏంటంటే.. ఏజెంట్లు తత్కాల్ టికెట్లు బుక్ చేయాలనుకుంటే బుకింగ్ విండో ఓపెన్ అయిన తర్వాత మొదటి 30 నిమిషాల్లో వారికి అనుమతి లభించదు. ఏసీ కోచ్​లను ఏజెంట్లు 10 నుంచి 10.30 వరకు బుక్ చేయలేరు. నాన్ ఏసీ కోచ్​లు 11 నుంచి 11.30 వరకు ఏజెంట్లు బుక్ చేసే వీలు ఉండదు. కాబట్టి రెగ్యులర్ పాసింజర్లు టికెట్లు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.