Fact Check Shinde : మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ ఆటో అలంకరించి ఉంటుంది. దాని ముందు ఓ గడ్డపాయన నిలబడి ఉంటాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఆటో డ్రైవర్‌గాఉన్నప్పటి ఫోటో .. ఆయన ప్రస్థానం గొప్పగా సాగిందని.. ఆయన అందరికీ ఆదర్శం అని ఓ రైటప్.. వాట్సాప్‌లో విస్తృతంగా ఫార్వార్డ్ అవుతోంది. ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌లో ఈ ఫోటో వైరల్ అయింది. ఇది నిజమా కాదా అని ఎక్కువ మంది ఆలోచించడం లేదు. ఫార్వార్డ్ చేసేస్తున్నారు.
అయితే ఇది ఏ మాత్రం నిజం కాదని ఫ్యాక్ట్ చెక్ పరిశీలనలో తేలింది. అసలు ఆ ఫోటోకు.. ఏక్ నాథ్ షిండేకు సంబంధం లేదు. ఇప్పుడు సర్క్యూలేట్ అవుతున్న ఫోటో మాత్రం ఆయనది కాదు. ఆయన పేరు బాబా కాంబ్లే. రిక్షా పంచాయత్ ఫౌండర్. ఈ విషయాన్ని పలువురు తమ సోషల్ మీడియా ఖాతాల్లో నేరుగానే చెబుతున్నారు.
ఏక్ నాథ్ షిండే ఒకప్పుడు ఆటో నడిపేవారని చెబుతారు. అయితే అది కొంత కాలమే. శివసేన పార్టీలో యాక్టివ్ అయిన తర్వాత ఆయన తన వృత్తిని వదిలేశారు. కానీ సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు మాత్రం ఆగడం లేదు.
ఏక్ నాథ్ షిండేపై సోషల్ మీడియాలో అనేక కథలు..కథనాలు ప్రచారం చేస్తున్నారు. అయితే ఆయన మీదే కాదు ఎవరు ప్రముఖ పదవులు చేపట్టినా అదే పరిస్థితి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాత ఫోటోలంటూ కొన్ని సర్క్యూలేట్ చేస్తున్నారు. అందులో చాలా వరకూ ఫేక్. ప్రధాని మోదీ టీ అమ్మే ఫోటోలంటూ గతంలో కొన్ని వైరల్ చేశారు. అవన్నీ కూడా ఫేక్. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఫేక్ ఏదో.. నిజమైనదో ఏదో తెలుసుకోవడం కష్టమన్నతంగా కొంత మంది ఫేక్ న్యూస్ హైలెట్ చేస్తున్నారు.