ఉగ్రవాదుల ఏరివేత చర్యల్లో భాగంగా భారత సైన్యం, కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ అఖల్’ కొనసాగుతోంది. సైన్యం, పోలీసు బృందాలు దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉన్న దట్టమైన అఖల్ అడవుల్లో కూంబింగ్ మూడోరోజు కొనసాగింది. మూడో రోజు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టగా.. ఓ సైనికుడు గాయపడ్డాడు. శనివారం ముగ్గురు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేయగా.. ఇప్పుడు ఆ సంఖ్య ఐదుకు చేరుకుంది.
ఏమిటీ ఆపరేషన్ అఖల్కశ్మీర్లోని పహల్గాంలోని ఏప్రిల్ 22న పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అనంతరం.. ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ పోరాటంలో భాగంగా ఉగ్రవాదులు ఎక్కువగా సంచలరించే కుల్గాంలోని అఖల్ అడవుల్లో భారత సైన్యం, కాశ్మీర్ పోలీసులు, CRPF, ఉన్నత పారామిలిటరీ యూనిట్ల సంయుక్తంగా ‘ఆపరేషన్ అఖల్’ చేపట్టాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు భారీగా ఆయుధాలు కలిగిన ఉన్నారని నిఘా వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు ఆపరేషన్ ప్రారంభించాయ. ఇప్పటికే ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.
భారీ కార్డన్-అండ్-సెర్చ్దట్టమైన అడవీ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులతో భద్రతా దళాలు సుదీర్ఘ కాల్పులు జరుపుతున్నారు. ఖచ్చితమైన నిఘా సమాచారం మేరకు భద్రతా దళాలు ఈ ప్రాంతంలో భారీ కార్డన్-అండ్-సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత శుక్రవారం ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. రాత్రిపూట కూడా కూంబింగ్ నిర్వహిస్తూ ఉగ్రవాదుల పనిపడుతున్నారు.
శుక్రవారం ఇద్దరు.. శనివారం ముగ్గురు హతంశనివారం రాత్రి భీకర కాల్పులు జరిగాయి. దళాలు ముందుకు సాగుతుండగా.. శుక్రవారం రాత్రి అడవుల్లో దాగి ఉన్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం రాత్రి సైతం భారీ కాల్పులు జరిగాయి. సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను తుదముట్టించాయి. ఈ కాల్పుల్లో ఓ సైనికుడికి బుల్లెట్ గాయాలు తగిలాయి.
మిలిటెంట్లు ఎవరు?హతమైన ఉగ్రవాదులు పాకిస్తాన్‌కు చెందిన నిషేధిత సంస్థ లష్కరే తోయిబా (LET) ప్రతినిధి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)తో అనుబంధంగా ఉన్నారని భద్రతా అధికారులు నిర్ధారించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ఇదే గ్రూపు గతంలో బాధ్యత వహించింది. ఈ ప్రాంతంలో TRF కార్యకలాపాలు పెరుగుతున్నట్లు తేలింది. ఇది జమ్మూ కాశ్మీర్ అంతటా తీవ్రవాద నిరోధక కార్యకలాపాలను పెంచింది.
ఆపరేషన్ అఖల్‌ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, 15 కార్ప్స్ కమాండర్ సహా ఉన్నత భద్రతా అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. అఖల్ ప్రాంతంలో దాక్కున్నట్లు భావిస్తున్న మిగిలిన ఉగ్రవాదులను తరిమికొట్టడానికి అధునాతన నిఘా సాధనాలు, ఖచ్చితత్వ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.
“రాత్రిపూట అడపాదడపా, తీవ్రమైన కాల్పులు కొనసాగాయి. అప్రమత్తమైన దళాలు ఎదురుకాల్పులతో స్పందించాయి. ఇప్పటివరకు భద్రతా దళాలు ఒక ఉగ్రవాదిని ఎన్‌కౌంటర్ చేశాయి. ఆపరేషన్ కొనసాగుతోంది.” అని ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్, X ఒక పోస్ట్ పెట్టింది. కొన్ని గంటల తర్వాత రెండో ఉగ్రవాది మట్టుబెట్టినట్లు అధికారులు నిర్ధారించారు. ఆపరేషన్ సమయంలో ఒక సైనికుడు గాయపడ్డాడని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. శనివారం రాత్రి మరో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు పేర్కొన్నారు.
పహల్గామ్ దాడి ప్రధాన సూత్రధారి హతం‘ఆపరేషన్ మహాదేవ్’ పూర్తయిన తర్వాత ఆ ఆపరేషన్ను స్టార్ట్ చేశారు. ఆపరేషన్ మహదేవ్లో పహల్గామ్ దాడికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సులైమాన్ అలియాస్ ఆసిఫ్ సహా ముగ్గురు ఉగ్రవాదులు శ్రీనగర్ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. గతేడాది సోనామార్గ్ టన్నెల్ దాడితో సంబంధం ఉన్న అతడి ఇద్దరు సహచరులు జిబ్రాన్, హంజా అఫ్గానీని సైతం హతమార్చారు.
చొరబాటు మార్గాలే లక్ష్యంగా..ఉగ్రవాద కార్యకలాపాల పెరుగుదల కారణంగా భద్రతా దళాలు మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించాయి. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లు, నియంత్రణ రేఖ (LOC) వెంబడి చొరబాటు మార్గాలను లక్ష్యంగా చేసుకున్నాయి.