India Sends Aid to Gaza: 


గాజాకి భారత్‌ సాయం..


యుద్ధంతో అల్లాడిపోతున్న గాజాకి సాయం చేసేందుకు భారత్‌ ముందుకొచ్చింది. భారీ ఎత్తున వైద్య సాయం అందించింది. అక్కడి ప్రజలకు అవసరమైన వాటిని ప్రత్యేక ఫ్లైట్‌లో పంపింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికారికంగా వెల్లడించింది. లైఫ్‌ సేవింగ్ మెడిసిన్స్‌తో పాటు సర్జికల్ ఐటమ్స్, టెంట్స్‌ పంపుతోంది. యూపీలోని ఘజియాబాద్‌లో Hindon Air Base నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన  C-17  ఫ్లైట్‌లో వీటిని పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తంగా 6.5 టన్నుల మెడికల ఎయిడ్, 32 టన్నుల డిజాస్టర్ రిలీఫ్ మెటీరియల్ పంపింది. ఈజిప్ట్‌లోని El-Arish Airportకి ఈ ఫ్లైట్‌ చేరుకోనుంది. గాజాకు ఏ సాయం అందాలన్నా అది ఈజిప్ట్‌ మీదుగా వెళ్లాల్సిందే. అందుకే ఈజిప్ట్‌తో సంప్రదింపులు జరిపింది భారత్. గాజాకు సాయం అందించేందుకు అనుమతినిచ్చింది. అయితే...ఆహారం, నీరు, మెడిసిన్స్‌కి పంపించేందుకు మాత్రమే ఈజిప్ట్ అంగీకరించింది. చమురు మాత్రం పంపడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఒక్కసారి ఈ వెహికిల్స్ అన్నీ వెళ్లిపోయాక వెంటనే ఈజిప్ట్ సరిహద్దుల్ని మూసేస్తోంది. ఈ పరిణామాలపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. గాజా అత్యంత దారుణమైన స్థితిలో ఉందని, ప్రపంచమంతా కలిసి మరింత సాయం అందించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది.  






ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే పాలస్తీనా అధ్యక్షుడు మహమౌద్ అబ్బాస్‌తో ( Mahmoud Abbas) మాట్లాడారు. గాజాలోని హాస్పిటల్‌పై దాడి జరిగిన నేపథ్యంలో మోదీ సానుభూతి తెలిపారు. ఆ ఘటనలో 500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయేల్, పాలస్తీనా మధ్య ఉన్న దశాబ్దాల వివాదాన్ని అర్థం చేసుకున్నామని, చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని సూచించారు. పాలస్తీనాకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇది జరిగిన మూడు రోజులకే భారత్ నుంచి గాజాకు భారీ సాయం అందింది.