భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 28,591 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 3,32,36,921కి చేరింది. గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా 338 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. కోవిడ్ బాధితుల్లో 34,848 మంది కోలుకున్నారని తెలిపింది. దీంతో రికవరీల సంఖ్య  3,24,09,345కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3,84,921 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 73.82 కోట్ల మందికి వ్యాక్సిన్లు అందించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 54.18 కోట్ల మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించినట్లు తెలిపింది. నిన్న (సెప్టెంబర్ 11) ఒక్క రోజే 15,30,125 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది.





 తాజాగా నమోదైన కోవిడ్ కేసుల్లో 20,487 కేసులు కేరళలోనే నమోదయ్యాయి. ఇక కేరళలో నిన్న ఒక్కరోజే కోవిడ్ కారణంగా 181 మంది మరణించారు. మహారాష్ట్రంలో 3,075 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.









Also Read: Elon Musk: ముందు 'మేక్ ఇన్ ఇండియా'.. తర్వాత పన్ను రాయితీ.. ఎల‌న్‌ మ‌స్క్‌కు షాకిచ్చిన కేంద్రం


Also Read: NEET 2021: ఇవాళ నీట్ ఎగ్జామ్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. పరీక్షకు వెళ్లేముందు ఈ గైడ్ లైన్స్ ఒక్కసారి చూసుకోండి..