India paused plans to buy US arms: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని భారత్ పై అమెరికా టారిఫ్‌లు విధించింది. దీనికి ప్రతిగా భారత్ అమెరికాకు షాకిచ్చే నిర్ణయాలు తీసుకుంది.  అమెరికా నుండి ఆయుధాలు, యుద్ధ విమానాల కొనుగోలు ప్రణాళికలను తాత్కాలికంగా నిలిపివేసింది.  డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై విధించిన 25 శాతం అదనపు టారిఫ్‌ల కారణంగా తీసుకున్నట్లు మూడు భారతీయ అధికార వర్గాలు తెలిపాయి.  ప్రస్తుతం అమెరికా వాణిజ్య భాగస్వాములలో అత్యధికం భారత్ పైనే విధించారు.  ట్రంప్ నిర్ణయాల కారణంగా  భారత్-అమెరికా సంబంధాలు దిగజారాయి. 

 అగస్టు 6, 2025న, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం రష్యన్ ఆయిల్ కొనుగోలు చేస్తూ రష్యా యొక్క ఉక్రెయిన్ దాడులకు ఆర్థిక సహాయం చేస్తోందని ఆరోపిస్తూ, భారతీయ వస్తువులపై అదనంగా 25 శాతం టారిఫ్ విధించారు. దీంతో భారత ఎగుమతులపై మొత్తం సుంకం 50 శాతంకి చేరింది. భారత్  అమెరికా నుండి పలు రకాల ఆయుధ సామాగ్రిని కొనుగోలు చేస్తోంది.   అమెరికా నుండి స్ట్రైకర్ యుద్ధ వాహనాలు , జావెలిన్ యాంటీ-ట్యాంక్ మిస్సైల్స్  ,  ఆరు బోయింగ్ P8I నావల్ రికనైసెన్స్ విమానాల కొనుగోలు చర్చలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ కొనుగోళ్ల విలువ సుమారు 3.6 బిలియన్ డాలర్లు. అదే సమయంలో రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఈ కొనుగోళ్ల ఒప్పందాలను ప్రకటించేందుకు వాషింగ్టన్‌కు వెళ్లాల్సిన  పర్యటనను  రద్దు చేశారు.  

 జనరల్ డైనమిక్స్ ల్యాండ్ సిస్టమ్స్ తయారు చేసిన ఈ వాహనాలను భారత సైన్యం కొనుగోలు చేయాలని భావించింది. ఈ చర్చలు ఫిబ్రవరి 2025లో ట్రంప్ ,  ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సంయుక్త ఉత్పత్తి,  కొనుగోలు ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. రేథియాన్,  లాక్‌హీడ్ మార్టిన్ అభివృద్ధి చేసిన ఈ మిస్సైల్స్ కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి.  భారత నౌకాదళం కోసం ఆరు బోయింగ్ P8I రికనైసెన్స్ విమానాలు ,  సపోర్ట్ సిస్టమ్స్ కొనుగోలు చర్చలు అధునాతన దశలో ఉన్నాయి. ఇప్పుడు వాటిని నిలిపివేశారు.  

కొన్ని సంవత్సరాలుగా భారత్ , అమెరికా మధ్య రక్షణ భాగస్వామ్యం బలపడింది. దీనికి చైనాతో ఉన్న వ్యూహాత్మక పోటీ ఒక కారణం. ఇంటెలిజెన్స్ షేరింగ్ ,  సంయుక్త సైనిక విన్యాసాలు ఈ భాగస్వామ్యంలో భాగంగా కొనసాగుతున్నాయి, కానీ టారిఫ్‌ల వల్ల ఈ స్నేహం అంతా చెడిపోతోంది.  భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు, రష్యా   ప్రధాన సరఫరాదారుగా ఉంది. అయితే, ఇటీవల భారత్ ఫ్రాన్స్, ఇజ్రాయిల్,  మెరికా నుండి ఆయుధాలను దిగుమతి చేసుకోవడం పెరిగింది.   ట్రంప్  టారిఫ్‌లు,   బెదిరింపులు భారత్‌లో అమెరికా వ్యతిరేక భావనలను పెంచాయని అమెరికాకు తలొగ్గాల్సిన అవసరం లేద్న భావన  వ్యక్తమవుతోందని అందుకే మోదీ.. కీలక నిర్ణయాలు తీసుకుటున్నారని అంటున్నారు.