India Pak Tensions : సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలతో భారత్ చాలా సులువుగా పాకిస్తాన్ ను టార్గెట్ చేసింది. అలా ఎలా జరిగిందని ప్రపంచం అంతా ఆశ్చర్యపోతోంది. అయితే ఆవేశంతో కాకుండా భారత్ ఆలోచనతో యుద్ధం చేసిందని మెల్లగా ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది.
భారత యుద్ధ విమానాలు కూల్చేశామని పాకిస్తాన్ సంబర పడింది. కానీ ఈ లోపు.. వారి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అంతా కుప్పకూలిపోయింది. భారత డ్రోన్ల దెబ్బకు అవన్నీ కాలిపోయాయి. ఈ షాక్ తగలక ముందే పాకిస్తాన్ ఎయిర్ బేస్ లన్నీ ధ్వంసమయ్యాయి. దీంతో పాకిస్తాన్ ఇంకా ఆలస్యం చేస్తే కాళ్లు పట్టుకోవడానికి చేతులు మిగలవని కాళ్లపై పడిపోయారు.
భారత్ ఇంత ఫాస్ట్ ఎలా స్పందించిందంటే.. పెహల్గాం దాడి జరిగిన తర్వాత భారత్ దాడులు చేయడానికి తొందరపడలేదు. దాడులు చేసిన తర్వాత పాకిస్తాన్ ఖచ్చితంగా స్పందిస్తుందని.. ఆ స్పందనను కూడా తిప్పి కొట్టి.. అదే చాన్స్ గా పాకిస్తాన్ ఆర్మీ మొత్తాన్ని దెబ్బకొట్టాలని అనుకుంది. ఆపరేషన్ సిందూర్ పూర్తయిన తర్వాత .. పాకిస్తాన్ భారత్ పై దాడులకు ప్రయత్నించింది. ఆ సమయంలో అవి పంపిన డ్రోన్స్ ను నిర్వీర్యం చేసిన భారత దళాలు తర్వాత యుద్ధ విమానాలను గాల్లోకి పంపాయి. వెంటనే పాకిస్తాన్ తన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని ఆన్ చేసింది. దాంతో అవి ఎక్కడ ఉన్నాయో భారత్ సైన్యం తెలుసుకుంది. భారత్ పంపిన యుద్ధ విమానాలను.. పాకిస్తాన్ కూల్చేసింది. సంబరాలు చేసుకుంది. కానీ ఏం జరిగిందో తెలిసేలోపే తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో పాటు ఎయిర్ బేసులన్నీ ధ్వంసమయ్యాయి.
తాము భారత్ యుద్ధ విమానాల్ని కూల్చామని వాటి శకరాలను తీసుకోవడానికి వెళ్లారు కానీ వాటిని చూసి పాకిస్తాన్ కు షాక్ తగిలింది. అవి డమ్మీ యుద్ధ విమానాలవి. దీంతో ఏం జరిగిందో తెలుసుకుని వారు కూడా సిగ్గుపడ్డారు. డమ్మీ విమానాలను ఎరగా వేసి తమను భారత్ చావు దెబ్బకొట్టిందని వారికి అప్పటికి అర్థం అయింది.
పాకిస్తాన్ పై దాడులు చేయడానికి భారత్ కొంత సమయం తీసుకుంది. అప్పటికప్పుడు దాడులు చేయకుండా.. దాడులు చేయలేదని ఫీల్ అవుతున్న వారికి అసలు ఆవేశం కాకుండా.. ఆలోచనతో వచ్చే విజయమేంటో తెలిసేలా చేసింది.