Canada Visa Service Suspend:
కీలక నిర్ణయం..
భారత్ కెనడా మధ్య ఉద్రిక్తతలు (India Canada Tensions) అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాకు వెళ్లే వాళ్లకు వీసాలు జారీ చేసే ప్రక్రియను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. మళ్లీ ఆదేశాలిచ్చేంత వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని తేల్చి చెప్పింది. ఇవాళ్టి నుంచే (సెప్టెంబర్ 21) ఇది అమల్లోకి వస్తుందని వెల్లడించింది. దీనిపై కెనడాలోని ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ అధికారికంగా ప్రకటన చేసింది. పలు కారణాల వల్ల ఈ ఆంక్షలు విధించాల్సి వస్తోందని తెలిపింది.
"కొన్ని కారణాల వల్ల ఇవాళ్టి నుంచి కెనడాకి వెళ్లే వాళ్లకు వీసాలు జారీ చేసే ప్రక్రియను నిలిపివేస్తున్నాం. సెప్టెంబర్ 21 నుంచే ఇది అమల్లోకి వస్తుంది. తదుపరి ఆదేశాలిచ్చేంత వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయి. మరిన్ని అప్‌డేట్స్ కోసం వెబ్‌సైట్‌ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి"
- ఇండియా వీసా అప్లికేషన్ సెంటర్, కెనడా