Patils Husband Death:


గుండెపోటుతో మృతి 


భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ భర్త డాక్టర్ దేవిసింగ్ షెకావత్ (89) మృతి చెందారు. పుణెలోని ఓ ఆసుపత్రిలో ఆయన కన్ను మూశారు. గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు నిర్ధరించారు. కొద్ది రోజులుగా ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఉదయం 9 గంటలకు తుది శ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రతిభా పాటిల్, దేవిసింగ్ షెకావత్‌ దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. షెకావత్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. 


"శ్రీమతి ప్రతిభా పాటిల్‌ గారికి, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. డాక్టర్ దేవిసింగ్ షెకావత్ తన సేవలతో సమాజంలో చెరగని ముద్ర వేశారు. ఓం శాంతి" 




ప్రధాని నరేంద్ర మోదీ 


ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ కూడా సంతాపం తెలిపారు. 


"సీనియర్ కాంగ్రెస్ నేత దేవిసింగ్ షెకవాత్ మృతి నన్నెంతో బాధకు గురి చేసింది. అమరావతికి ఆయనే తొలి మేయర్‌గా సేవలందించారు. ప్రతిభా పాటిల్‌కు అండగా నిలిచారు" 


- శరద్ పవార్, ఎన్‌సీపీ అధినేత 




మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దేవిషింగ్ షెకావత్ మృతి పట్ల ట్విటర్‌లో సానుభూతి వ్యక్తం చేశారు.