India Debunks Viral Claims Of Pakistani Air Strike: పాకిస్తాన్ లో ని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేయడంతో పాకిస్తాన్ కు దిక్కు తోచడం లేదు. గతంలో పాకిస్తాన్ లో జరిగిన మత ఘర్షణల వీడియోలను.. శ్రీనగర్, కశ్మీర్ లో జరిగినట్లుగా చూపిస్తూ..సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటున్నారు. ఫేక్ న్యూస్ తో మానసిక ఆనందం పొందుతున్నారు. 

పాకిస్తాన్ వైమానిక దళం భారత సైనిక స్థావరాలపై విజయవంతంగా దాడి చేసిందని పాకిస్తాన్ సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటోంది. పాత వీడియోలను వైరల్ చేసుకంటున్నారు. అయితే  వైరల్ ఫుటేజ్ ఇటీవలి సరిహద్దు సైనిక చర్యలకు సంబంధించినది కాదని స్పష్టం చేస్తూ, భారతదేశ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ వాదనలను  తోసిపుచ్చింది.

పాకిస్తాన్ శ్రీనగర్ వైమానిక స్థావరాన్ని మరియు జమ్మూ కాశ్మీర్‌లోని భారత బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుందని పేర్కొంటూ అనేక పాకిస్తాన్ అనుకూల సోషల్ మీడియా ఖాతాలు ఇటీవల వీడియోలను పోస్ట్ చేశాయి. విస్తృతంగా కొన్ని వీడియోలను షేర్ చేశారు. పాకిస్తాన్ తిరిగి దాడి చేసిందని చెప్పుకున్నారు.  

అయితే, భారత ప్రభుత్వ అధికారిక వాస్తవ తనిఖీ విభాగమైన PIB ఫ్యాక్ట్ చెక్ ఈ కథనాన్ని త్వరగా తోసిపుచ్చింది. వైరల్ వీడియో భారతదేశం నుండి కాదని, 2024లో పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన మత ఘర్షణల వీడియో అని స్పష్టం చేసింది.   ఈ ఫుటేజ్‌కు భారతదేశంతో సంబంధం ఉన్న ఇటీవలి సైనిక పరిణామాలకు ఎటువంటి సంబంధం లేదు, సున్నితమైన సమయాల్లో ధృవీకరించని కంటెంట్‌ను పంచుకునేటప్పుడు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని తెలిపింది.  

 పాకిస్తాన్ సైన్యానికి ఇప్పటి వరకూ ఎలా స్పందించాలో తెలియడం లేదు. 

ఓ వైపు యుద్ధం వస్తే పాకిస్తాన్ సర్వనాశనం అవుతుంది. అందుకే ఆలోచిస్తున్నారు. అయితే తాజాగా   ఒత్తిడి పెరిగిపోవడంతో చివరికి   భారత దాడులకు ప్రతిస్పందించే అధికారం పాకిస్తాన్ ఆర్మీకి  ప్రధాని షహబాద్ షరీఫ్  ఇచ్చినట్లుగా  తెలుస్తోంది.  'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారతదేశం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం తన సైనిక దళాలను కోరింది.