ముంబయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే ఎలక్ట్రికల్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలో టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ, బీటెక్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్). లేదా డిప్లొమా తర్వాత ఆరేళ్ల సంబంధిత అనుభవంతో డిప్లొమా (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 03
* టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టులు
అర్హతలు: బీఈ, బీటెక్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్). లేదా డిప్లొమా తర్వాత ఆరేళ్ల సంబంధిత అనుభవంతో డిప్లొమా (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు.
దరఖాస్తు ఫీజు: రూ.50. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పే స్కేల్: నెలకు రూ.44900- రూ.1,42,400.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.08.2023.
Notification
ALSO READ:
పోస్టాఫీసుల్లో కొలువుల జాతర, 30 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి!
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టాఫీసుల్లో 30,041 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్ షెడ్యూల్-2, జులై 2023) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.10,000 - రూ.12,000 ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 23 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో 1520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి జులై 26న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1520 పోస్టులను భర్తీ చేయనున్నారు. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 25 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, పని అనుభవం తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది. మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సులో ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ రాష్ట్ర నర్సులు, మిడ్‌వైవ్స్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. (లేదా) ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీ-పర్పస్ హెల్త్ వర్కర్(మహిళ) శిక్షణా కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక సంవత్సరం క్లినికల్ శిక్షణను పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
1207 'స్టెనోగ్రాఫర్' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా!
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ - 2023 ప్రకటనను ఆగస్టు 2న విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1207 స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టైపింగ్ తెలిసి ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..