IIT Madras student gets record-breaking job offer Rs 4 Croe 50 lakhs at Jane Street: ఇప్పుడు అంతా క్యాంపస్ ప్లేస్‌మెంట్ల హవా నడుస్తోంది. చాలా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఇండియన్ టాలెంట్  ను హైర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎంతైనా అందరూ ఫ్రెషర్లే. ఎవరికైనా కోటి వరకూ ఆఫర్ వస్తే అది బీభత్సం అనుకోవచ్చు. కానీ ఓ స్టూడెంట్ ఏకంగా నాలుగున్నర కోట్ల రూపాయలు ఆఫర్ చేసింది అమెరికా కంపెనీ. అంతే కాదు ఇక్కడ్నుంచి అమెరికాకు రీలోకేట్ అయ్యే ఖర్చులన్నీ పెట్టుకుంటామని రాసిచ్చింది.ఇదే విద్యార్థి కోసం సింపూర్ కు చెందిన మరో కంపెనీ కూడా ఐపీ ఎల్ వేలం పాట తరహాలో ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది.  


Also Read: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?


ఐఐటీ మద్రాస్‌లో కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిలో అకడమిక్స్ లో మంచి ప్రతిభ చూపుతున్నారు. ఆయనను క్యాంపస్ ఇంటర్యూలో హైర్ చేసేందుకు పలు సంస్థలు పోటీ పడ్డాయి. చివరికి అమెరికాలో ట్రేడింగ్ కంపెనీగా పేరున్న జానే స్ట్రీట్ ఈ విషయంలో జాక్ పాట్ కొట్టేసింది. ఐదు లక్షల ఇరవై వైలకుపైగా డాలర్లను ఏడాది జీతంగా ఆఫర్ చేసింది. అంటే మన రూపాయల్లో నాలుగున్నర కోట్లు. ఈ ఆఫర్ లెటర్ తో పాటు అమెరికాలో ఉద్యోగాం చేయడానికి అవసరం అయ్యే అన్ని సౌకర్యాలను కల్పిస్తారు.                       


ఐఐటీ విద్యార్థులకు మంచి ఆఫర్లు వస్తాయని అందరూ అనుకుంటారు కానీ ఇలా ఒక్క సారి ప్రారంభంలోనే నాలుగున్నర కోట్లు ఆఫర్ చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఇదే విద్యార్థికి సింగపూర్ కు చెందిన మరో ట్రేడింగ్ కంపెనీ కూడా భారీగా ఆఫర్ చేసిందని తెలుస్తోంది. కానీ జానే స్ట్రీట్ ముందడుగు వేసింది. ఐఐటీల్లో విద్యార్థులను ఎంపిక చేసుకునేందుకు పలు విదేశీ కంపెనీలుకూడా ప్లేస్ మెంట్స్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉంటాయి. చాలా కంపెనీలు వారికి భారీ ఆఫర్లు ఇచ్చినా ఇండియాలోనే ప్లేస్ మెంట్ ఇస్తాయి. కానీ ఇక్కడ మాత్రం అమెరికాకు రీ లోకేషన్‌కు చాన్సిచ్చింది.                                      


Also Read:  ఏపీ యువతకు గూగుల్ నైపుణ్య శిక్షణ - నారా లోకేష్ సమక్షంలో ఒప్పందం


ఐఐటీల్లో జరుగుతున్న క్యాంపస్ సెలక్షన్స్‌లో పదకొండు మందికి వివిధ కంపెనీలు రూ. కోటికిపైగా ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మిలిన విద్యార్థులకు కూడా పెద్ద పెద్ద కంపెనీలు బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయని అంటున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రైవేటు యూనివర్శిటీలు, కాలేజీల్లో పెద్ద ఎత్తున క్యాంపస్ రిక్రూట్ మెంట్లు జరుగుతున్నాయి. ఈ సారి జాబ్ మార్కెట్ బాగుంటుందని పెద్ద ఎత్తున ఫ్రెషర్లు ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంటున్నారు.